Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు నోటీసులు AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో షాక్ తగిలింది. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో ఆయనకు నోటీసులు అందాయి. ఈరోజు విచారణకు తమ కార్యాలయం ఎదుట హాజరు కావాలని మంగళగిరి డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. By V.J Reddy 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయన కొడుకును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయనకు నోటీసులు అందాయి. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆయనకు మంగళగిరి డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసేందుకు ఎందుకు వెళ్లారు?, దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అని జోగి రమేష్ ను మంగళగిరి డీఎస్పీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మీతో పాటు ఎవరెవరు వచ్చారు?, మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు అనే దానిపై జోగి రమేష్ ను విచారించనున్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ వ్యవహరంలో జోగి రమేష్ తనయుడు తోపాటు భూముల కొనుగోలు చేసిన వారిని, భూములు అమ్ముటకు సహకరించిన ప్రభుత్వ అధికారుల పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు లో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల తోపాటు దేవినేని అవినాష్, నందిగామ సురేష్. #jogi-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి