Telangana Elections: ఆ జిల్లా పేరు మారుస్తాం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కీలక ప్రకటన!

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనగామ జిల్లా పేరును మారుస్తామని అన్నారు. ఆ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరు పెడుతామని వెల్లడించారు.

New Update
Madhu Yaskhi Goud: కాంగ్రెస్ నేత మధు యాష్కీకి తప్పిన ప్రమాదం

Madhu Goud Yaskhi: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు వింత.. వింత హామీలు ఇస్తున్నారు. అయితే ఆ హామీలు నెరవేరుతాయా? లేదా? అనేది తర్వాతి అంశం. ప్రస్తుతానికి వస్తే రాజకీయ నాయకులు ఇచ్చే హామీలతో తెలంగాణ ప్రజలైతే హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ చేసిన ఓ హామీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత

LB నగర్ కాంగ్రేస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మధు యాష్కీ గౌడ్ ప్రచారంలో వేగం పెంచారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ సుధీర్ రెడ్డిపై గెలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనగామ జిల్లాను సర్ధార్ సర్వాయి పాపన్న జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీసీలు కీలకంగా వ్యవరించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలు అణిచివేయబడ్డారన్నారు. ఇటీవలే కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ వల్ల బీసీ క్యాటగిరిలోని అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుల గణనకు మద్దతు తెలిపారని, మహిళా బిల్లులో రిజర్వేషన్లు ఉండాలని కూడా రాహుల్ గాంధీ కోరినట్లు వెల్లడించారు. బలహీన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అన్నారు.

అర్హులైన బీసీ విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు లోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీ కులాలకు వృత్తి బజార్ల ఏర్పాటుతో పాటు గీతా కార్మికుల మాదిరి ఇతర కులాలకూ 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామన్నారు. ముదిరాజ్ కులస్థులను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చుతామన్నారు. ప్రతి గ్రామంలో గౌడ కులస్థులకు ఈత, తాటి వనాల పెంపకం కోసం 5 ఎకరాల భూమిని 90 శాతం సబ్సిడీ విధానంలో అందజేస్తామని పేర్కొన్నారు.

ALSO READ: పవన్ కళ్యాణ్ కు  షాక్.. కీలక నేత రాజీనామా 

Advertisment
Advertisment
తాజా కథనాలు