Nayanthara : పెళ్లికి కావాలి కానీ.. డబ్బుకు వద్దా అంటూ.. నయనతార పై ఫైర్‌ అయిన మాధవీలత..!

నయనతార హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంది. బొట్టు పెట్టుకొని ఎన్నో వీడియోస్ చేసింది. నీ పెళ్లికి హిందుత్వం కావాలి.. కానీ నీ డబ్బుకు మాత్రం హిందుత్వం వద్దా అంటూ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ప్రశ్నించారు.

New Update
Nayanthara : పెళ్లికి కావాలి కానీ.. డబ్బుకు వద్దా అంటూ.. నయనతార పై ఫైర్‌ అయిన మాధవీలత..!

Tollywood : సౌత్‌ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్‌ స్టార్‌(Lady Super Star).. నయనతార(Nayanthara)  గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌(Tollywood) లో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పర్సనల్‌ లైఫ్‌ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ ని వివాహం చేసుకుని ఇద్దరు మగబిడ్డలకు తల్లి అయ్యింది.

కొత్త జీవితంలోకి ప్రవేశించిన ఆమె ఇప్పుడిప్పుడే సంతోషంగా గడుపుతుంది అనుకుంటున్న సమయంలో ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ప్రస్తుతం ఈమె మీద బీజేపీ(BJP) నేత మాధవీలత(Madhavi Latha) విరుచుకుపడ్డారు.

నయనతార హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంది. బొట్టు పెట్టుకొని ఎన్నో వీడియోస్ చేసింది. నీ పెళ్లికి హిందుత్వం కావాలి.. కానీ నీ డబ్బుకు మాత్రం హిందుత్వం వద్దా అంటూ ప్రశ్నించింది. మీరంతా ఆమెపై కేసు వేయొచ్చు గా అని నన్ను అడుగొచ్చు కానీ నేను అలా కేసుల చుట్టూ తిరగను, ఇలాంటి చీడ పురుగుల కోసమే చాలా హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటూ వివరించింది. ప్రస్తుతం ఈమె నయనతార పై చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Also read : లాలూ యాదవ్‌ కి షాక్‌…ఆయుధాల కేసులో అరెస్ట్‌ వారెంట్‌ జారీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు