కుటుంబంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా: మహిళ దారుణ హత్య

వద్దన్నా వినకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండడంతో కలకత్తాలో ఓ తాపీ మేస్త్రి తన భార్యను దారుణంగా చంపేశాడు. ఎంతచెప్పినా భార్య వినకపోవడంతో భర్త ఈ దారుణ హత్యకు ఒడిగట్టాడు.

New Update
కుటుంబంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా: మహిళ దారుణ హత్య

Social media: సోషల్ మీడియా ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వద్దన్నా వినకుండా ఇన్ స్టా (Instagram)లో రీల్స్ చేస్తుండడంతో కలకత్తాలో ఓ తాపీ మేస్త్రి తన భార్యను దారుణంగా చంపేశాడు. అపర్ణ అనే మహిళ తరచూ ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ చాలా మంది ఫాలోవర్లను పెంచుకున్నారు. వారిలో కొందరితో నిత్యం చాట్ చేస్తుండేది. ఇది తన భర్త పరిమళ్ వైద్యకు నచ్చలేదు. అపర్ణ వైఖరి నచ్చని భర్త పలు మార్లు హెచ్చరించాడు. ఆమెపై క్రమంగా అనుమానం పెంచుకున్న పరిమళ్ బైద్య తరచూ గొడవపడేవాడు. ఆమె చాలాసార్లు అలిగి పుట్టింటికి కూడా వెళ్లింది.

ఇది కూడా చదవండి: బర్త్‌ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి!

గొడవ క్రమంగా ముదిరి పరిమళ్ వైద్య తన భార్య గొంతు కోసి హతమార్చాడు. హత్య అనంతరం పరారయ్యాడు. అపర్ణ కుమారుడు ఇంటికొచ్చే సరికి తల్లి రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించి భయాందోళనకు గురయ్యాడు. అతడి ఏడ్పులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న పరిమళ్ బైద్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అపర్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment