IPL 2024: ఉత్కంట పోరులో చెన్నై పై విజయం సాధించిన లక్నో!

ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా మారింది.నిన్న జరిగిన చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్ లో స్టాయినిస్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.అద్భుత శతకంతో లక్నోకు విజయాన్ని అందించాడు. అసలు లక్నో మ్యాచ్ గెలవటానికి టర్నింగ్ పాయింట్ ఇక్కడే..!

New Update
IPL 2024: ఉత్కంట పోరులో చెన్నై పై విజయం సాధించిన లక్నో!

ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ లో వారి సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో కేఎల్ రాహుల్ సేన గెలిచింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ మ్యాచ్ లో 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపు ఉన్నప్పటికీ.. సీఎస్కే బౌలర్లపై స్టోయినీస్ విరుచుకుపడ్డాడు. మార్కస్‌ స్టాయినిస్ 63 బంతుల్లోనే 124 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుని గెలిపించాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి.

లక్నో బ్యాటింగ్ లో చివరలో దీపక్ హుడా కేవలం 6 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ (16), పడిక్కల్ (13), పూరన్ (34) పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్ లో మతీషా పతిరాన 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రహమన్ చెరో వికెట్ తీశారు.

అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో నాటౌట్ గా ఉండగా..శివ‌మ్ దూబె కేవలం 27 బంతుల్లో 66 పరుగులు బాదాడు. అతని ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే CSK బ్యాటింగ్ లో అజింక్యా రహానే (1) నిరాశపరిచాడు. మిచెల్ (11), జడేజా (16), ధోనీ (4) పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ సంపాదించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు