Ants: వంటగదిలో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ మూడు చిట్కాలు పాటిస్తే చీమలు పరార్‌!

వేసవిలో వంటగదిలో చీమల సమస్య పెరుగుతుంది. చీమలు ఆహారం మీద పడతాయి మరియు వంటగదిలో పని చేయడం కష్టం అవుతుంది. మీరు చీమలను వెంటనే వదిలించుకోవడానికి ఇంట్లో సబ్బు నీరు, నిమ్మకాయ, పసుపు, వెనిగర్, చక్కెర- బోరాక్స్ మిశ్రమంతో కొన్ని సులభమైనతో చీమల బెడద పోతుంది.

New Update
Ants: వంటగదిలో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ మూడు చిట్కాలు పాటిస్తే చీమలు పరార్‌!

Home Tips: వేసవిలో వంటగదిలో చీమల సమస్య పెరుగుతుంది. చీమలు ఆహారం మీద పడితే వంటగదిలో పని చేయడం కష్టం అవుతుంది. వంటగదిలో చీమలు ఆహారం వాసన వల్ల త్వరగా వస్తాయి. మందు కూడా పనిచేయదు. అయితే చీమలను వెంటనే వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. ఆ చిట్కాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పసుపు:

  • పసుపులో సహజసిద్ధమైన లక్షణాలు ఉన్నాయి. ఇవి చీమలను తరిమికొట్టడంలో సహాయపడతాయి. వంటగదిలో ఎక్కడైనా ఎర్రటి చీమలు కనిపిస్తే.. పసుపు పొడిని అక్కడ చల్లలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో, వంటగదిలో ఉండే చీమలు పారిపోతాయి.

చక్కెర- బోరాక్స్ మిశ్రమం:

  • ఈ చిట్కా కోసం ఒక కప్పు నీటిలో ఒక చెంచా బోరాక్స్ పౌడర్, రెండు చెంచాల చక్కెర పొడిని కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ఒక ప్లేట్‌లో ఉంచాలి. చీమలు ఈ ప్లేట్‌లో చిక్కుకుంటాయి. వంటగది చీమలు లేకుండా ఉంటుంది.

సబ్బు నీరు:

  • చీమలను వదిలించుకోవడానికి సబ్బు నీటిని ఉపయోగించవచ్చు. దీనికోసం.. సబ్బు, నీరు కలపడం ద్వారా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో గుడ్డను ముంచి కిచెన్ కౌంటర్, ఫుడ్ కంటైనర్లను శుభ్రం చేయాలి. సబ్బు నీళ్లతో శుభ్రం చేయడం వల్ల నేలపై, గోడలపై చీమలు కనిపించవు.

నిమ్మకాయ:

  • నిమ్మకాయ సువాసన, దాని ఆమ్ల స్వభావం చీమలను దూరంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఒక స్ప్రే బాటిల్‌లో నిమ్మరసం, నీరు కలిపి వంటగదిలో చీమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. అంతేకాకుండా వంటగది మూలల్లో నిమ్మతొక్కను ఉంచుకోవచ్చు.

వెనిగర్:

  • చీమలను తరిమికొట్టడానికి కూడా వైట్ వెనిగర్ ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్‌లో సగం నీరు, సగం వెనిగర్‌ను కలిపి ఈ మిశ్రమాన్ని చీమలు వచ్చే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. దీంతో చీమలు వెంటనే పారిపోతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: రోటీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి!

Advertisment
Advertisment
తాజా కథనాలు