Lord Brahma: బ్రహ్మ దేవుడు ముఖం ఆకారంలో దుస్తులు.. ర్యాంప్‌పై నడిచిన క్యూట్‌ గర్ల్‌.. షాక్‌లో నెటిజన్లు!

బ్రహ్మ దేవుడి ముఖాన్ని పోలి ఉన్న ఓ డ్రెస్‌ డిజైన్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఓ ముద్దుగుమ్మ ఈ డ్రెస్‌ను ధరించింది. 3D ఎఫెక్ట్‌తో ఈ డ్రెస్‌ డిజైన్ చేయడం విశేషం. రాహుల్‌ మిశ్రా ఈ డ్రెస్‌ను డిజైన్ చేయగా అతని క్రియేటివిటీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

New Update
Lord Brahma: బ్రహ్మ దేవుడు ముఖం ఆకారంలో దుస్తులు.. ర్యాంప్‌పై నడిచిన క్యూట్‌ గర్ల్‌.. షాక్‌లో నెటిజన్లు!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్‌ చేసిన డ్రెస్‌తో అంతర్జాతీయ ర్యాంప్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో జాన్వీ లుక్‌ అందరికి బాగా నచ్చింది. దీంతో డిజైనర్‌ని చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడుదే రాహుల్ పేరు మరోసారి మారుమోగుతోంది. తన లేటెస్ట్ డిజైన్‌తో ఫ్యాషన్‌ లవర్స్‌ను రాహుల్‌ ఉర్రూతలూగించాడు. ఈ ఫ్యాషన్‌ షోకి సంబంధించి మరిన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో ఒక మోడల్ బ్రహ్మ దేవుడు ముఖం ఆకారంలో ఉన్న దుస్తులు ధరించి కనిపించింది.


బ్రహ్మదేవుడిని మైండ్‌లో పెట్టుకోని డిజైన్:
రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన సీక్విన్ డ్రెస్ వేసుకుని ర్యాంప్‌పై నడిచిన మోడల్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ డ్రెస్‌ చూసి షాక్‌ అయ్యారు. బ్రహ్మదేవుడిని దృష్టిలో పెట్టుకోని ఆ డ్రెస్‌ డిజైన్ చేసినట్టుగా అర్థమవుతోంది.. రాహుల్ క్రియేషన్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇందులో మోడల్ తలపై నలుపు రంగు సీక్విన్ హెడ్‌గేర్‌ను ఉంచారు. దీని కారణంగా 3 తలలు ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఆమె బ్లాక్ ఫ్లవర్ డిటైలింగ్ టాప్‌, స్కర్ట్‌తో మెరిసింది.

సెల్యూట్ బ్రో:
బ్రహ్మ దేవుడు మొత్తం విశ్వానికి సృష్టికర్త అని రాహుల్ చెబుతున్నారు. నాలుగు దిక్కులను చూసేందుకు ఆయనకు నాలుగు తలలు ఉండేవని పురాణాల్లో చెప్పారట. ఇక రాహుల్ రూపొందించిన ఈ దుస్తుల్లో బ్లాక్ సీక్విన్ కార్సెట్ టాప్‌పై 3D నిర్మాణం ఉంటుంది. పైభాగంలో ఫ్లవర్ డిజైన్ ఉంది, మెడపై అంచు మాత్రమే నక్షత్రాలతో హైలైట్ చేసి ఉంది. ఇందులో ముఖం మొత్తం సీక్విన్ స్టార్‌లతో డిజైన్ చేశారు. దీని కారణంగా మోడల్ ముఖం దగ్గర 3D ప్రభావం అద్భుతంగా కనిపిస్తోంది. అందుకే రాహుల్ ఫొటోలు షేర్ చేసిన వెంటనే అతనిపై ప్రశంసల వర్షం మొదలైంది. చాలామంది అతని క్రియేటివీటికి సెల్యూట్ చేస్తున్నారు.

Also Read: ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్‌ కాదు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు