BJP Madhavi Latha: హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఆందోళనలో అసదుద్దీన్?

నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సెగ్మెంట్ లో కేవలం 46 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది బీజేపీకే ప్లస్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆమెకు పట్టు ఉన్న కర్వాన్, గోషామహల్ లో పోలింగ్ పెరిగి, మజ్లీస్ కు పట్టున్న మలక్ పేటలో పోలింగ్ తగ్గడం చర్చనీయాంశమైంది.

New Update
BJP Madhavi Latha: హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఆందోళనలో అసదుద్దీన్?

హైదరాబాద్‌ పార్లమెంట్‌లో పరిధిలో కేవలం 46.08 శాతం పోలింగ్‌ నమోదవడం చర్చనీయాంశమైంది. మజ్లీస్ కంచుకోటలో ఇంత తక్కువ పోలింగ్ కావడం అసద్ కు ఆందోళన కలిగించే అంశమేనన్న టాక్ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థికి తక్కువ పోలింగ్ పర్సంటేజ్ కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 50 శాతం కన్నా తక్కువ పోలింగ్ నమోదు కావడంపై ఎంఐఎం శ్రేణుల్లోనూ టెన్షన్ వ్యక్తం అవుతోంది. నిన్న మధ్యాహ్నమే పోలింగ్ శాతం తక్కువ నమోదు అవుతుందన్న అంచనా ఏర్పడడంతో.. అలర్ట్ అయిన ఎంఐఎం నేతలు ఇంటింటికీ తిరుగుతూ ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.

హిందూ ఓటింగ్ అధికంగా ఉండే.. కార్వాన్‌, గోషామహాల్‌లో పోలింగ్‌ శాతం పెరగడం ఎంఐఎంను టెన్షన్ పెడుతోంది. కార్వాన్‌లో 51 శాతం, గోషామహాల్‌లో 49 శాతం పోలింగ్‌ నమోదైంది. అసద్‌కు పట్టున్న మలక్‌పేటలో పోలింగ్‌ తగ్గింది. ఆ నియోజకవర్గంలో కేవలం 38 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. చాంద్రాయణగుట్టలో 45.19 శాతం, చార్మినార్‌లో 48.53 శాతం పోలింగ్ నమోదైంది.

యకూత్‌పురాలో 42.70 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. మారిన పరిణామాలు అసదుద్దీన్ మెజార్టీని తగ్గించొచ్చు కానీ.. ఓడించే పరిస్థితి లేదని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బీజేపీ శ్రేణులు మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు