Loksabha Elections 2024: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీతో పాటు.. తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ హామీలివే! రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీ ఇలా 23 హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయి మేనిఫెస్టో తో పాటు ఈ హామీలను అమలు చేస్తామని తెలిపింది. By Nikhil 03 May 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Congress Manifesto Released: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలను ప్రకటించింది. ఆ హామీలు ఇలా ఉన్నాయి. 1. హైదరాబాద్ మహా నగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్ 2 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం a) కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, b) బయ్యారంలో ఉక్కు కర్మాగారం, c) హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) d) హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ. e) మైనింగ్ విశ్వవిద్యాలయం Congress Telangana Manifesto Released at Gandhi Bhavan. గాంధీభవన్ లో తెలంగాణ మేనిఫెస్టో విడుదల -- కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోతో పాటు... తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు. -- Along with the National Manifesto of the Congress Party... special assurances to the people of… pic.twitter.com/MWGXWNQJCq — Congress for Telangana (@Congress4TS) May 3, 2024 3. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు అయినా ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం మరియు పిచుకలపాడులు తిరిగి తెలంగాణలో విలీనం. 4. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా. 5. నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు. 6. నూతన ఎయిర్పోర్ట్ల ఏర్పాటు, 7. రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు 8 నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు.. 9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు. 10. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు 11. జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు. 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ఏర్పాటు 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ఏర్పాటు. 14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) క్యాంపస్ ఏర్పాటు. 15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు. 16. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు. 17. 73 & 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ. 18. ప్రతీ ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు. 19. దిగువ తెలిపిన ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు. a) హైదరాబాద్- బెంగళూరు IT మరియు ఇండస్ట్రియల్ కారిడార్ b) హైదరాబాద్ - నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ C) హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ d) హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్ e) సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, 20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రం (International Cultural and Entertainment Hub) 21. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా. 22. డ్రై పోర్టు ఏర్పాటు. 23. హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి