Parliament : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు.. LIVE
నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన వారంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని ఆశిస్తున్నానన్నారు.
Parliament Sessions : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము (Murmu) ప్రసింగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన వారంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని ఆశిస్తున్నానన్నారు. తమ ప్రభుత్వం భారత్ (India) ను ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉందన్నారు.
గతంలో కంటే రెట్టింపు కి.మీ జాతీయ రహదారులను నిర్మించామన్నారు. మూడుకోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు (Agriculture Jobs) పెరుగుతున్నాయని.. పౌర విమాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేశంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయని.. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.
Aghori - Sri Varshini: పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తెలంగాణకు పయణం!
అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు వారిని కేదరీనాథ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిద్దరినీ తెలంగాణకు తీసుకువస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అఘోరీ - శ్రీ వర్షిణీ వ్యవహారం రోజు రోజుకూ సినిమాను తలపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడంతా వీరి వ్యవహారమే నడుస్తోంది. ఎక్కడ చూసినా అఘోరీ, శ్రీవర్షిణీ గురించే చర్చలు. కాగా ఇప్పుడు వీరిద్దరూ పరారీలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఆచూకీ లేదు. ఇటీవలే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తమపై నెగెటివ్‌గా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.
అంతేకాకుండా ప్రచారం ఆపకపోతే.. తామిద్దరం ఆత్మార్పణం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఇక వారిపై రెండు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేస్తారనే భయంతో అందుబాటులో లేరని ప్రచారం నడుస్తోంది. అయితే వారిపై కేసులు నమోదు అయిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అఘోరీ, శ్రీవర్షిణీని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. తాజాగా అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిని కేదరినాథ్‌లో పట్టుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని తెలంగాణకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే వారిని పట్టుకుని తెలంగాణకు తెచ్చిన తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపిస్తారా? లేదా? అనే దాని గురించి పలువురు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే అల్లూరి శ్రీనివాస్.. అఘోరీ వేషంలో తిరుగుతూ అమ్మాయిలను మోసం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అఘోరీ, శ్రీ వర్షినీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో.. అప్పటి నుంచి వీరి ఎపిసోడ్స్ మరింత హాట్ టాపిక్ అయింది. నేనే అఘోరీ మొదటి భార్యను అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది.
నన్నే మొదట పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. నాకు మాయమాటలు చెప్పి ఇప్పుడు వర్షిణీ అనే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. దీని తర్వాత అఘోరీ-శ్రీవర్షిణీ వ్యవహారంలోకి ట్రాన్స్ జెండర్స్ ఎంటర్ అయ్యారు. అఘోరీ ట్రాన్స్ జెండర్ల పేరు గంగపాలు చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అఘోరీపై రెండు కేసులు నమోదు అయ్యాయి.
aghori sri varshini | Lady Aghori Sri Varshini | latest telugu news | today news in telugu | telugu-news today news