Shock For BJP: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

TS: లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి మక్తల్ బీజేపీ నేత జలంధర్‌రెడ్డి, మెదక్‌ బీజేపీ నేత పులిమామిడి రాజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.

New Update
Shock For BJP: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

Shock For BJP: లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి మక్తల్ బీజేపీ నేత జలంధర్‌రెడ్డి, మెదక్‌ బీజేపీ నేత పులిమామిడి రాజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.  సీఎం రేవంత్ వెంట మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఉన్నారు. కాగా పులిమామిడి రాజు బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు.
👉 ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.@revanth_anumula @NMRPTCpic.twitter.com/eoQ2qq3shO

రసవత్తరంగా మెదక్ పార్లమెంట్ స్థానం..

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల నడుమ పార్లమెంట్ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండనుంది. ఇందుకు కారణం ప్రజాధారణ  ఉన్న అభ్యర్థులే పోటీ పడడం. బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి దిగారు. అలాగే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నీలం మధు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామి రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడి ప్రజలు పట్టం కడుతారనేది వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు