Veena Vijayan: కేరళ సీఎంకు షాక్ ఇచ్చిన ఈడీ

లోక్ సభ ఎన్నికల వేళ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు.

New Update
Veena Vijayan: కేరళ సీఎంకు షాక్ ఇచ్చిన ఈడీ

Kerala CM's daughter Veena Vijayan: లోక్ సభ ఎన్నికల వేళ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేయగా.. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు.

ALSO READ: తప్పిన భారీ ప్రమాదం.. విరిగిన విమానం రెక్క

అసలేం జరిగిందంటే..

వీణా చెందిన కంపెనీకి ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా నగదు చెల్లింపులు చేసిందనే ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణా తో పాటు మరికొందరి కి త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం (SFIO) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వీణాతో పాటు ఆమె సంస్థ, మరికొందరి పై ఈడీ PMLA కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్ రూటైల్‌ లిమిటెడ్‌ అనే సంస్థ కేరళ సీఎం కూతురు వీణాకు చెందిన ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్ కంపెనీకి 2018-19 మధ్య అక్రమంగా రూ.1.72 కోట్లు చెల్లింపులు చేసినట్టు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. కొచ్చిన్‌ మినరల్స్‌కు ఎక్సాలాజిక్‌ ఎలాంటి సర్వీస్‌ను అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ తెలిపింది.

దీంతో ఎక్సాలాజిక్‌పై ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు తేల్చి చెప్పింది. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు