Koneru Konappa: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప!

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిర్పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఈ క్రమంలో త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడంతో బీఆర్ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా చేశారు.

New Update
Koneru Konappa: కాంగ్రెస్‌లోకి  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప!

Koneru Konappa May Join Congress: తెలంగాణలో రాజకీయాలు నేతల రాజీనామాలు.. చేరికలతో ఆసక్తికరంగా మారాయి. రానున్న లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) కలిసి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ - బీఎస్పీ పార్టీలు పొత్తు (BRS - BSP Alliance) పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిర్పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు కారణం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పోటీకి దిగడమే. తనపై పోటీ చేసి.. తనపై, బీఆర్ఎస్ పార్టీపై ఎన్నో ఆరోపణలు చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నచ్చక బీఆర్ఎస్ పార్టీకి కోనేరు కోనప్ప రాజీనామా చేశారు.

కారు దిగి కాంగ్రెస్ కు ఫిక్స్!

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కోనేరు కోనప్ప తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయ్యారు. కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరేందుకే సీఎం రేవంత్ తో భేటీ అయ్యారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. రెండ్రోజుల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే కోనేరు కోనప్పకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. మరి కోనేరు కోనప్పకు కాంగ్రెస్ ఏ పదవి ఇస్తుందో వేచి చూడాలి.

నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ నిరాశే..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి కోనేరు కోనప్ప బీజేపీ అభ్యర్థిపై 3వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చెందారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కోనేరు కోనప్ప రానున్న లోక్ సభ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. నాగర్ కర్నూల్ నుంచి తనకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇస్తారని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం తు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరగడంతో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు రాజీనామా చేశారని టాక్ వినిపిస్తోంది.

Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు