MP Ranjith Reddy: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ? ఎంపీ రంజిత్ రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు కేసీఆర్. అయితే... ఇప్పటి వరకు చేవేళ్ల అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడంతో త్వరలో ఎంపీ రంజిత్ రెడ్డి గులాబీ కండువా తీసేసి మూడు రంగుల జెండా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MP Ranjith Reddy May Join Congress: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు నేతల రాజీనామాలు, చేరికలతో వేడెక్కుతున్నాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేస్తారని జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ చేసిన అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ (KCR). చేవెళ్ల, వరంగల్ ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం చేవేళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గా ఉన్న రంజిత్ కుమార్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఆయనకు కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఫైనల్ చేశారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి బలం చేకూరింది. ALSO READ: మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన చేవెళ్ల అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్.. ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. మొదటి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురిని ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితా ప్రకటించగా అందులో తెలంగాణ అభ్యర్థులను ప్రస్తావించలేదు. మొదటి జాబితాలో తెలంగాణ చేవెళ్ల ఎంపీ టికెట్ ను సునీతా మహేందర్ రెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జరగగా.. చేవెళ్ల ఎంపీ టికెట్ ను ప్రకటించకుండా కాంగ్రెస్ హైకమాండ్ హోల్డ్ లో పెట్టింది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ చేరడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ చేరనున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆ నలుగురు... * జహీరాబాద్- సురేష్ షెట్కర్ * నల్గొండ – జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి * మహబూబాబాద్- బలరాం నాయక్ * మహబూబ్ నగర్ – వంశీచంద్ రెడ్డి #brs #lok-sabha-elections-2024 #mp-ranjith-reddy #shock-for-kcr #mp-ranjith-reddy-to-join-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి