UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్.. యూపీలో భారీ దెబ్బ! యూపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 42కిపైగా స్థానాల్లో లీడింగ్‌తో దూసుకెళ్తోంది. వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజలో ఉండడం గమనార్హం. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోడీకంటే ముందంజలో ఉన్నారు. By srinivas 04 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి UP Election Results: ఈ ఎన్నికల్లో మోడీకి ఊహించని షాక్ తగిలింది. 400 పైగా సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేయాలనుకున్న ఎన్డీఏకు కనీసం 300 సీట్లు కూడా దాటే పరిస్థితి కనిపించట్లేదు. అయోధ్య రామ మంత్రంతో ప్రచారం నిర్వహించినప్పటకీ ఇది కూడా పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూపీలో బీజేపీ సీట్లకు భారీగా గండి పడింది. ఉత్తరప్రదేశ్ తమదే అన్న ధీమాలో ఉన్న బీజేపీకి ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్తోంది. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో ప్రస్తుత సమాచారం ప్రకారం ఇండియా కూటమి సుమారు 42కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ ప్రస్తుతం 37 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుంది. తొలి రౌండ్‌లో వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉండడం గమనార్హం. అక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ముందంలో ఉన్నారు. యూపీలో ఈసారి బీజేపీ 75 స్థానాల్లో పోటీ చేసింది. 5 సీట్లను కూటమి పార్టీలకు ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 17, తృణమూల్ ఒక సీటులో పోటీ చేసింది. అటు మహారాష్ట్రలోనూ మోడీ వేవ్ పనిచేయలేదు. ఫలితంగా కేంద్రంలో స్వల్ప మెజార్టీతో NDA ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి 233 సీట్లతో లీడ్ లో ఉండగా.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతు అయ్యాయి. మమత బెనర్జీ తన పట్టు నిలుపుకున్నారు. #modi #up #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి