KCR: భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. తాజాగా మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ , నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను ప్రకటించారు.

New Update
KCR: భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

BRS Chief KCR: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తాజాగా మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ , నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును ప్రకటించారు. అయితే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అందులో 16 స్థానాల్లో పోటీ చేసే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం లో పోటీ చేసే అభ్యర్థిని ఇంకా కేసీఆర్ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ ఒక్క ఎంపీ సీటు ఎంపీ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారు. మరో వైపు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

ALSO READ: కేసీఆర్ కుటుంబంలో మరొకరు అరెస్ట్

అప్పుడు బీఎస్పీకి..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలను బీఎస్పీ పార్టీకి కేటాయించారు కేసీఆర్. అయితే.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడంతో బీఎస్పీ తో ఉన్న పొత్తును తెంచుకుంది బీఆర్ఎస్. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు బీఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును ఖరారు చేశారు కేసీఆర్. కాగా మిగిలి హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

కేసీఆర్ ప్రకటించిన 16 మంది వీరే..

* పెద్దపల్లి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* కరీంనగర్ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
* మహబూబాబాద్ – మాలోత్ కవిత
* ఖమ్మం – నామా నాగేశ్వరరావు
* చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
* వరంగల్ – కడియం కావ్య
* మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి
* ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
* నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్‌
* జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
* నాగర్ కర్నూల్ – ఆర్ ఎస్ ప్రవీణ్
* మెదక్ – మాజీ ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి
* సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్
* మహబూబ్‌ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
* భువనగిరి - క్యామ మల్లేష్
* నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు