LK Advani: లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న! బీజేపీ అగ్రనేత, లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఎల్కే అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. 90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ.. అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు. By Trinath 03 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bharat Ratna for LK Advani: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెప్పారు. ట్విట్టర్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు మోదీ. 'శ్రీ ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న (Bharat Ratna) ఇవ్వబడుతుందని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడాను. ఈ గౌరవం లభించినందుకు అభినందించాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. "I am very happy to share that LK Advani will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour..," PM Narendra Modi tweets. https://t.co/6gyT2TJaI7 pic.twitter.com/YmKIHz52G8 — ANI (@ANI) February 3, 2024 'మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఒకరు (LK Advani), భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పని చేయడం నుంచి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం ప్రారంభమైంది' అని మోదీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. 'ఆయన మన హోం మంత్రిగా.. ఐ అండ్ బి మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ శ్రేష్టమైన, గొప్ప అంతర్దృష్టితో నిండి ఉన్నాయి' అని మోదీ పోస్ట్ చేశారు. అద్వానీ ప్రోఫైల్ పాయింట్స్: ---- 1927 నవంబర్ 8న పాకిస్తాన్ కరాచీ సింధ్‌లో జన్మించిన అద్వానీ ---- వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియానీ దేవి దంపతులకు జన్మించిన అద్వానీ ---- 15ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక ---- దేశ విభజన సమయంలో భారత్‌కు వలసొచ్చిన అద్వానీ ---- 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నిక ---- 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అద్వానీ ---- 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత దేశరాజకీయాల్లో కీలక ప్రాత్ర ---- వాజ్‌పేయి హయాంలో కీలకమైన హోంశాఖను నిర్వహించిన అద్వానీ ---- అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను ఒంటబట్టించుకొని ఇంజనీరింగ్ చదువును కూడా మానేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యారు అద్వానీ. 1947 సెప్టెంబర్ 12న భారత్‌కు వలస వచ్చిన అద్వానీ ..దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గాంధీజీ హత్య తర్వాత పలువురు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ అయ్యారు. Also Read: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక..! #lk-advani #bharat-ratna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి