Jealousy : ప్రేమలో కొంచెం అసూయ కూడా అవసరమే..ఎందుకంటే..?

మీ భాగస్వామి మీతో కాకుండా మరొకరితో సమయం గడుపుతుంటే కాస్త అసూయ కలగడంలో తప్పు లేదు. ఇది సాధారణ విషయమే. కాస్త అసూయతో ఉన్నట్టు ప్రవర్తిస్తే అది ఇద్దరి మధ్య బలమైన బంధానికి సంకేతం కావొచ్చు.అయితే అసూయ పెరిగితే జీవితాలే తలకిందలవుతాయని గమనించగలరు.

New Update
Jealousy : ప్రేమలో కొంచెం అసూయ కూడా అవసరమే..ఎందుకంటే..?

Jealousy On Partner : ప్రేమ(Love) లో తగాదాలు, అసూయ ఉండటం సహజం. భాగస్వామి(Partner) పట్ల ప్రేమను చూపించేందుకు ఇవి దోహదపడతాయి. మీ భాగస్వామి ఏదైనా విషయంలో కోపంగా ఉన్నా, ఎప్పుడూ మీపై అసూయతో ఉన్నా మీ ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడినట్టే అని నిపుణులు అంటున్నారు. ప్రేమలో కొంచెం అసూయ ఉంటే ఏం అవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కొంచెం అసూయ సహజం:

  • మీ భాగస్వామి మీతో కాకుండా మరొకరితో సమయం గడుపుతుంటే, స్నేహితుల(Friends) తో అభిరుచులను పంచుకుంటున్నా కాస్త అసూయ(Jealousy) కలగవచ్చు. కానీ అది సాధారణ విషయమే అని నిపుణులు అంటున్నారు. బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతున్నారు.

నియంత్రించడం కష్టమే:

  • అసూయను నియంత్రించడం అంత సులభం కాదు. కానీ ప్రతికూల భావోద్వేగాలను ఎలా ఎదుర్కొంటారనేదే ముఖ్యమని మానసిక నిపుణులు(Psychiatrists) అంటున్నారు. ఒక వేళ మీ భాగస్వామికి ఇలాంటి అసూయ ఉంటే దాన్ని నెమ్మదిగా తగ్గించేందుకు ప్రయత్నించాలని, మాట్లాడి ఒక క్లారిఫికేషన్‌ ఇస్తే బంధం మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు.

చెడు భావాల వల్ల సంబంధాలు తెగిపోవచ్చు:

  • అసూయ ఎక్కువైతే అది మీ సంబంధాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అవతలి వ్యక్తి మాటకు గౌరవం ఇచ్చి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. వాదించడం వల్ల అవతలివారికి మీపై నమ్మకం పోతుందని, కొన్నిసార్లు పెద్ద పెద్ద గొడవలకు కూడా దారి తీస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళనకు కూడా కారణం అవుతుందని, అవతలి వ్యక్తిపై ప్రేమ పోతుందని చెబుతున్నారు. అందుకే మనసులో ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవించాలని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే ఒక కిడ్నీ ఉన్నా సంతోషంగా జీవించవచ్చు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు