Liquor Price: మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన సర్కార్.. భారీగా పెరిగిన ధరలు..!

మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మద్యం ధరలను పెంచింది సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్డర్ పై రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ. 20 చొప్పున పెంచింది ప్రభుత్వం. విదేశీ మద్యంపైనా ధరలు పెంచింది.

New Update
Telangana: మద్యం అమ్మకాలు, ఆదాయంలో తెలంగాణే టాప్..!

Liquor Price Hikes in AP: మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చిందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మద్యం ధరలను భారీగా పెంచింది. పన్నుల సవరణ పేరుతో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, మద్యంపై విధించే అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఏఆర్‌ఈటీ)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చాలని ఏపీఎస్‌డీసీఎల్‌ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం ఓకే చెప్పింది.

కాగా, ఐఎంఎఫ్ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం.. మద్యం ధరల పెరుగుదల ఇలా ఉంది. ఫుల్‌ బాటిల్‌ లిక్కర్ ధర ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. క్వార్టర్‌ రూ.200 నుంచి రూ.210కి చేరింది. అయితే, అన్ని రకాల బ్రాండ్ల ధరలు ఇలాగే లేవు. కొన్ని బ్రాండ్ల ధరలు స్వల్పంగా తగ్గడం విశేషం.

ఫారిన్ లిక్కర్‌పై బాదుడే..

చాలా కాలంగా ఫారిన్ లిక్కర్‌ ధరలను సరవించలేదన్న ప్రభుత్వం.. తాజాగా వాటిపై ధరలను పెంచింది. ఫారిన్ లిక్కర్ సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. దీనిని కూడా 20 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది.

Also Read:

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..

రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

Advertisment
Advertisment
తాజా కథనాలు