MLC Kavitha: రౌస్‌ అవెన్యూ స్పెషల్‌ కోర్టు కి కవిత!

ఢిల్లీ లో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా కవితనే అని సీబీఐ ఆరోపించింది.రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో బుధవారం లిక్కర్ కేసు విచారణ జరగనుంది. కవిత తో పాటూ ఇతర నిందితులను కూడా వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పరచనున్నారు.

New Update
MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు

Delhi Liquor Scam: ఢిల్లీ లో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితనే (MLC Kavitha) అని సీబీఐ (CBI) ఆరోపించింది. ఆప్‌ కు 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత ఆధ్వర్యంలోనే జరిగినట్లు
సీబీఐ పేర్కొంది.

ఈ కేసులో ఇప్పటికే చాలా సార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ (ED), సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో బుధవారం లిక్కర్ కేసు విచారణ జరగనుంది.

బుధవారం లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ గురించి విచారణ చేపట్టనున్నారు.బుధవారం కవిత తో పాటూ ఇతర నిందితులను కూడా వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పరచనున్నారు. ఈ కేసును జడ్జి కావేరి భవేజా విచారించబోతున్నారు.

Also Read: నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.

New Update
PahalgamTerroristAttack

PahalgamTerroristAttack

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఇద్దరు తెలుగు వాసులు

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్‌ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్‌ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

Advertisment
Advertisment
Advertisment