Lionel Messi: ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ..మూడోసారి ఎంపికయిన స్టార్ ఆటగాడు ఈసారి కూడా మెస్సీనే స్టార్ ఆటగాడిగా నిలిచాడు. 2023 ఏడాది పురుషుల విభాగంలో ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ ఎన్నికయ్యాడు. వరుసగా మూడోసారి దీన్ని కైవసం చేసుకున్న ఫుట్ బాల్ స్టార్ రికార్డ్ సృష్టించాడు. By Manogna alamuru 17 Jan 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Lionel Messi Won Fifa Best Player: ఫుట్ బాట్ అంటే మెస్సీ...మెస్సీ అంటే ఫుట్ బాల్ అన్నట్టు తయారైంది. ఎంతమంది సూపర్ ప్లేయర్స్ వచ్చినా మెస్సీకి పోటీ ఇచ్చేవారే లేకుండా అయిపోయింది. ఆ విషయం మరోసారి ప్రూవ్ అయింది. పవర్ ఫుల్ ప్లేతో ప్రపంచ ఫుట్ బాట్ అభిమానుల మనసు దోచుకుంటున్న మెస్సీ (Lionel Messi) 2023 ఏడాది ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డను గెలుచుకున్నాడు. ఇతనికి ఇది రావడం వరుసగా మూడో సారి. ఇది కూడా ఒక రికార్డ్ ఇప్పటి వరకు ఏ ఫుట్ బాల్ ప్లేయర్‌కూ మూడుసార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ రాలేదు. Also Read:హానీమూన్ కి ఆలస్యం అవుతుందనే పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు! ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ... 2023 ఫిఫా (FIFA) బెస్ట్ ప్లేయర్ అవార్డ్‌కు మెస్సీకి గట్టి పోటీనే ఎదురయ్యింది. నార్వఏ ఫార్వార్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ 48 పాయింట్లతో సముజ్జీలుగా నిలిచారు. అయితే కెప్టెన్నల ప్యానెల్ నుంచి మెస్సీకి ఎక్కువ ఓట్లు రావడంతో చివరికి విజేతగా అతనినే ప్రకటించారు. రికార్డ్ స్థాయిలో మెస్సా ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును మూడోసారి గెలుచుకున్నాడు. 2019, 2022, 2023 సంవత్సరాల్లో అతనికి ఈ అవార్డ్ వచ్చింది. Messi is crowned #TheBest! 👑🇦🇷 Click here for more information. ➡️ https://t.co/niVRuFY4lP pic.twitter.com/krIyrtkexL — FIFA World Cup (@FIFAWorldCup) January 15, 2024 బాలన్ డి ఓర్ అవార్డు కూడా... మెస్పీ ఆట ముందు ఇదొక్క అవార్డే కాదు ఇంకా చాలా అవార్డులు తలవొగ్గాయి. 2023 బాలన్ డి ఓర్ అవార్డ్ (Ballon d'Or Award) ను కూడా మెస్సీనే సొంతం చేసుకున్నాడు. ఇందులో కూడా అతనికి రికార్డ్ ఉంది. బాలన్ డి ఓర్ అవార్డును మెస్సీ ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మరోవైపు మెస్సీకి అవార్డు ప్రకటించగానే మరో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనిని కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. అయితే ఈసారి రొనాల్డో అసలు ఈ ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ రేస్‌లోనే లేడు. ఇక మెస్సీ అవార్డు అయితే గెలుచుకున్నాడు కానీ దానిని అందుకోవడానికి మాత్రం అందుబాటులో లేడు. లీగ్‌లతో బిజీగా ఉండడం వలన అవార్డుల ఫంక్షన్‌కు రాలేకపోయాడు. అయితేనేం మెస్సీ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. తమ ఫేవరెట్ ప్లేయర్ మరిన్ని అవార్డులు గెలుచుకుంటాడని చెబుతున్నారు. #foot-ball #fifa-best-player #lionel-messi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి