క్రికెటర్లు చూయింగ్ గమ్ ఎందుకు నములుతారో మీకు తెలుసా?

మిగతా వారితో పోలిస్తే చూయింగ్ గమ్ నమిలే ఆటగాళ్లకి చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మొదడికి బ్లడ్ సరఫరా కావడంతో పాటు సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ హార్మోన్ విడుదల కావడం, అలసట తగ్గుతుందని తెలిపారు.

New Update

క్రికెట్, ఫుట్‌ బాల్, వాలీబాల్.. ఇలా ఏవైనా గేమ్స్ ఆడే క్రీడాకారులు ఎక్కువగా చూయింగమ్ నమలుతుంటారు. సాధారణంగా చాలా మంది చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ ఆటగాళ్లు ఎక్కువగా చూయింగ్ గమ్ వాడుతారు. అసలు ఆటగాళ్లు ఎక్కువగా ఎందుకు వాడుతుంటారు? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని నిపుణులు అంటున్నారు. చూయింగమ్ నమిలిన వ్యక్తిలో చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: జగన్‌, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!

అలసట నుంచి విముక్తి..

చూయింగమ్ నమిలే ప్రాసెస్‌లో.. సాధారణ సమయంకంటే మెదడుకు ఎక్కువ మొత్తంలో బ్లడ్ సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చూయింగమ్ తింటున్న వ్యక్తిలో మెదడుకు విశ్రాంతినిచ్చే సెరోటోనిన్ కూడా విడుదలవుతుంది. కాబట్టి గ్రౌండ్‌లో ఉన్నప్పుడు అలసటను ఎదుర్కోగలుగుతారు. ఈ కారణాల వల్ల క్రీడాకారులు గేమ్స్ ఆడుతున్నప్పుడు చూయింగమ్ నమలడానికి ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు