నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..? బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. 4వ రోజు ప్రత్యేకతే నానే బియ్యం బతుకమ్మ.. ఈ రోజు బతుకమ్మ పేర్చే తీరు పెరుగుతుంది. నానే బియ్యం బతుకమ్మకు సమర్పిస్తారు. ఇలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరడంతో నాలుగోరోజు వేడుక ముగుస్తోంది. By Vijaya Nimma 04 Oct 2024 in లైఫ్ స్టైల్ తెలంగాణ New Update Bathukamma షేర్ చేయండి Bathukamma 2024: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ..అలాగే మూడోరోజున ముద్దపప్పు బతుకమ్మను మహిళలు జరుపుకుంటారు. అయితే నాలుగో రోజు ప్రత్యేకతే నానే బియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు వచ్చేసరికి బతుకమ్మ పేర్చే తీరు పెరుగుతుంది. 4 అంతరాల ఎత్తులో రంగురంగుల పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఈ రోజు ఉదయం మహిళలు రకరాల పూలను తెంచుకొచ్చి. ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూలను చక్కగా పేరుస్తూ బతుకమ్మను తయారుచేస్తారు. అంతరాలు అంటే అంతస్తులు అని అర్థం. నానబెట్టిన బియ్యంతో అద్భుతమైన రుచి: ఈ బతుకమ్మలో తంగేడు, గునుగు పూలు ఎక్కువగా వినియోగిస్తారు. గౌరమ్మను తయారు చేసి బతుకమ్మపై ఉంచి అమ్మవారిని ఆవాహన చేస్తారు. తర్వాత నానబెట్టిన బియ్యం, పాలతో పాటు బెల్లం కలిపి తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజుల్లో నైవేద్యాలు సైతం మారిపోతున్నాయి. నానబెట్టిన బియ్యాన్ని రుబ్బుకుని అందులో పాలతో పాటు బెల్లం కలిపి చలిమిడి తయారు చేసుకుంటారు. ఇది అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. ఈ నైవేద్యాన్ని బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించి ఇక సాయంత్రం ఇంటి ముందు బతుకమ్మను పెట్టి మహిళలంతా కలిసి చప్పట్లతో ఆడిపాడుతూ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మకు ఇష్టమైన గీతాలు పాడుతూ తల్లిని చల్లగా చూడమంటూ వేడుకుంటారు. అలా ఆ బతుకమ్మలను ఊరి చెరువులో వదిలిలేసి ఆరోజు కార్యక్రమాన్ని ముగిస్తారు. తర్వాత నానే బియ్యం బతుకమ్మకు సమర్పించిన నైవేద్యాన్ని అందరికి ప్రసాదంగా పంచిపెడతారు. ఇలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరడంతో నాలుగోరోజు వేడుక ముగుస్తోంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ఈ దేశంలో ఎవరూ పిల్లల్ని కనరు..ఎందుకో తెలుసా? #Bathukamma 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి