లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో.. నాలుగోరోజు అమ్మవారు దర్శనం విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. By Kusuma 06 Oct 2024 in లైఫ్ స్టైల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి హిందూ సంప్రదాయ పండుగల్లో నవరాత్రులకు ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా నవరాత్రుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులను ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు జరుపుకుంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు పూజించే అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కనిపిస్తారు. ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్ అష్టైశ్వర్యాలు కలుగుతాయని.. విజయవాడ కననదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా నాలుగో రోజు అనగా ఈ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవీగా అలకరింస్తారు. చెరకుగడ, పాశం, విల్లు, అంకుశము ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవీని పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇది కూడా చూడండి: కోమాలో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయా? షాకింగ్ విషయాలు ఉదయాన్నే లేచి ఇళ్లు అన్ని శుభ్రం చేసుకుని ఇంట్లో కుంకుమ పూజ చేయాలి. ఇంట్లో చేయలేని వాళ్లు కనకదుర్గమ్మ ఆలయంలో చేయవచ్చు. ఈ రోజు ఆలయంలో అమ్మవారిని కుంకుమతో పూజ చేస్తారు. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు ఈ ఆలయంలో భక్తులు అమ్మవారి సేవలో ఉంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇది కూడా చూడండి: DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు #vijayawada-kanaka-durga-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి