నేటి రాశిఫలాలు.. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉందంటే?

నేడు కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అనుకున్న పనులు మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగినా తర్వాత జరుగుతాయి. అయితే గ్రహాల వల్ల అదృష్టం పట్టబోతున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Update
horoscope 2025 today

horoscope 2026 today

మేషం

ఈరోజు మీరు అనుకున్న పనులు మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగినా, పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. మీ మీద ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం మంచిది. మనశ్శాంతి కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

వృషభం
ఈరోజు మీకు చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులను ధైర్యంగా పూర్తి చేస్తారు. అవసరమైనప్పుడు ఇతరుల నుంచి సాయం అందుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి భోజనం చేస్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి.

మిథునం
వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీకు సంతోషాన్ని ఇచ్చే ఒక మంచి విషయం వింటారు. ఆంజనేయ స్వామిని స్మరించుకోండి.

కర్కాటకం
ఏ పని చేపట్టినా ప్రణాళికతో చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కార్యాలయంలో మీ హోదా పెరుగుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు. వినాయకుడిని ప్రార్థించడం మంచిది.

సింహం
జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఒక మంచి వార్త వింటారు. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. మీ కుటుంబ సభ్యుల మాటలను గౌరవించి, వారి సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవ సందర్శనం శుభప్రదం.

కన్య
ఆఫీసులో లేదా చేసే వ్యాపారంలో మీ అధికారం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. బంధువులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. గణపతిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందుతారు.

తుల
ఈరోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీరు చేసే పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులను ధైర్యంగా పూర్తి చేసి, అందరి ప్రశంసలు అందుకుంటారు. పరమేశ్వరుని ఆరాధించడం చాలా మంచిది.

వృశ్చికం
ఈరోజు మీకు శుభ దినం. మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త మీ మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఇష్ట దైవ ప్రార్థన మీకు మేలు చేస్తుంది.

ధనుస్సు 
పెద్దల ఆశీస్సులు, సహకారం మీకు అందుతాయి. పనులు మొదలుపెట్టినప్పుడు చిన్నపాటి అడ్డంకులు వచ్చినా, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే, అనవసర ఖర్చులు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభం జరుగుతుంది.

మకరం
ఏ పని చేపట్టినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి సంయమనంతో ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది.

కుంభం
ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. మీరు మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆందోళన చెందకుండా మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మీనం
ఆపద సమయంలో మీకు సహాయం అందుతుంది. అయితే, బంధువుల సలహాలను పట్టించుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక లేకపోతే అనవసర ఖర్చులు పెరుగుతాయి. పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు. పరమేశ్వరుని ఆరాధించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Advertisment
తాజా కథనాలు