నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాలు కావడంతో స్వామివారికి ఘనంగా చక్రస్నానం నిర్వహించి మాడ వీధుల్లో విహరించున్నారు. ఈ రోజు స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు. By Kusuma 12 Oct 2024 in లైఫ్ స్టైల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి తిరుపతిలోని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఎనిమిది రోజుల నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దశేష వాహనంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లో తిరుమాఢవీధుల్లో శ్రీవారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నారు. ఇది కూడా చూడండి: చెన్నై-విజయవాడ జన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు రద్దు ఘనంగా చక్రస్నానం.. స్వామి వారు శ్రవణా నక్షత్రంలో అర్చావతారంలో భూలోకంలో ఆవిర్భవించడంతో ఈ రోజును ఎంతో పుణ్యదినంగా భావిస్తారు. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు, చక్రతాళ్వారులను వరహస్వామి వారిని ముఖ మండపానికి తీసుకువస్తారు. ఆ తర్వాత ఉభయ దేవేరులతో నున్న శ్రీవారి సరసన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీవారిని పవిత్ర జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. ఇది కూడా చూడండి: జ్ఙాపకశక్తి మందగిస్తుందా..అయితే ఎయిర్ ఫ్రెషనర్లు కూడా కారణం కావొచ్చు! స్వామివారి పుష్కరణిలో అవభృత స్నానంతో చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ చక్రస్నానం జరిగిన రోజున పుష్కరణిలో భక్తులు స్నానాలు చేస్తే సకలమైన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చూడండి: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే? #tirumala #brahmostavalu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి