తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఎలా పూజించాలి?

తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మొత్తం 9 రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటిరోజు భాద్రపద అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మను పూజిస్తారు. నువ్వులు, నూకలు, బియ్యంపిండితో వంటకాలు చేసి గౌరమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు.

New Update
Bathukamma

తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. మొత్తం 9 రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకల్లో గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. భాద్రపద అమావాస్య నాడు ప్రారంభం అయ్యి మొత్తం 9 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. పూలతో గౌరమ్మను తయారుచేసి ఆడపడుచులు ఆటపాటలతో సందడి చేస్తారు.

ఇది కూడా చూడండి:  Lal Bahadur Sastri:చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు‌‌

ఎంగిలి పూలతో..

తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి వంటి పూలతో చేస్తారు. అయితే ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేయడానికి ముందు రోజే పూలు తెచ్చి నీళ్లలో వేసి ఉంచుతారు. పువ్వులు ఇలా నిద్ర చేయడంతో వీటిని ఎంగిలి పూలు అంటారు. ఇంటి పెద్దలకు పూజించి కొంచెం భోజనం చేసి.. ఇలా తెచ్చిన పువ్వులతో తొలిరోజు గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భోజనం చేసిన తర్వాత బతుకమ్మను తయారు చేయడం వల్లనే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్పుకుంటారు. తొలి రోజు వేడుకల్లో నువ్వులు, నూకలు, బియ్యంపిండితో తయారు చేసిన వంటలను గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు. ఇలా మొదటి రోజు బతుకమ్మను పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. 

ఇది కూడా చూడండి: విషాదం.. కాల్వలో ముగ్గురు గల్లంతు

Advertisment
Advertisment
తాజా కథనాలు