అటుకుల బతుకమ్మ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే?

తెలంగాణ ప్రజలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండో రోజు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజు గౌరమ్మకి ఇష్టమైన అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి అటుకుల బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు చేస్తారు.

New Update
Bathukamma Viral Video: బతుకమ్మ ఆడిన అమెరికా ప్రజా ప్రతినిధి.. నెటిజన్ల ప్రశంసల వర్షం (వీడియో)

ఆశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య రోజు నుంచి తెలంగాణ ప్రజలు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆడపడుచులు అందరూ ఘనంగా జరుపుకున్నారు. తొలి రోజు ఎక్కడ చూసిన బతుకమ్మలతో ఇళ్లు కలకలలాడాయి. అయితే  బతుకమ్మ రెండో రోజు వేడుకలను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అనగా ఈరోజు జరుపుకుంటారు. అటుకుల బతుకమ్మ పేరుతో ఈరోజు తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.

ఈ పువ్వులు తప్పనిసరి..

రెండో రోజు బతుకమ్మను రెండు వరుసల్లో రకరకాల పూలతో తయారు చేస్తారు. ఈ రోజు గౌరమ్మకి నైవేద్యంగా అటుకులు, బెల్లంతో తయారు చేసిన వంటకాలను పెడతారు. అటుకుల బతుకమ్మ రోజు పిల్లలు ఎక్కువగా బతుకమ్మను తయారు చేసి ఆడుతారు. అయితే రెండో రోజు బతుకమ్మను తయారు చేసేటప్పుడు గునుగు, తంగేడు పూల తప్పనిసరిగా ఉండేట్లు చూసుకుంటారు. ఆడపడుచులు అందరూ ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. అయితే ఈరోజు అటుకుల బతుకమ్మ మాత్రమే కాకుండా.. దేవి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. 

బతుకమ్మను ఎలా చేస్తారంటే?

ఒక రాగి పళ్లెం తీసుకుని అందులో ముందు తామర ఆకులు, గునుగు, తంగేడు పూల ఆకులను పరచాలి. ఆ తర్వాత తంగేడు పూలు మళ్లీ పెట్టి రంగురంగులుగా అమర్చాలి. ఇలా గోపురం ఆకారం వచ్చే వరకు పూలను పెడతారు. పేర్చడం అయిపోయిన తర్వాత పసుపుతో చేసిన గౌరీ దేవి లేదా అమ్మవారి ప్రతిమను దానిపై పెడతారు. ఆభరణాలతో అమ్మవారిని అందంగా అలంకరించి పసుపు, కుంకుమ పెడతారు. రకరకాల పూలతో ఇలా తయారు చేయడం వల్ల బతుకమ్మ చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. 

Also Read :  కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో ఎన్టీఆర్, నాని

Advertisment
Advertisment
తాజా కథనాలు