/rtv/media/media_files/2025/04/10/hmX2ap6ohqjlexGwEOgB.jpg)
Standing long time
Standing Long Time: మనలో చాలా మంది ఉదయం నిద్రలేసినప్పటికీ నుండి పడుకునే వరకు చాలా సమయం నిలబడి ఉంటారు. మరికొందరు నిలబడి పని చేస్తారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. ఎక్కువసేపు నిలబడటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ గణనీయంగా మందగిస్తుందని నిపుణులు అంటున్నారు.
Also Read : RCB ఫసక్.. కోహ్లీ ఔట్- 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోరంటే?
మోకాలు, కీళ్ల నొప్పులు వస్తాయి:
దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుందని చెబుతున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల వెరికోస్ వెయిన్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల నరాలు నీలం, ఎరుపు రంగులోకి మారుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో నొప్పి, తిమ్మిర్లు, దురద ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల మొత్తం శరీరం బరువు కాళ్లపై పడుతుంది. దీనివల్ల మోకాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. కాళ్ల వెనుక భాగంలో రక్త ప్రసరణ పరిమితం అవుతుంది. వాపు వస్తుంది. దీని వల్ల నొప్పి వస్తుంది.
ఇది కూడా చదవండి: తరచుగా పార్కులకు వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఈ సమస్య తీవ్రమైతే కొన్ని రోజులకు చర్మం నీలం రంగులోకి మారుతుంది. మోకాళ్లు, పాదాలలో తీవ్రమైన వాపు కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల శరీరం పూర్తిగా అలసిపోతుంది. తల తిరుగుతున్నట్లు ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి పని చేయాల్సి వస్తే ఒకే స్థితిలో 8 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా కూర్చోవలసి వచ్చినప్పుడు కూడా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోకూడదు. పని సామర్థ్యానికి అనుగుణంగా డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మధ్యలో ముందుకు వెనుకకు నడవాలి. శరీరంలోని వివిధ భాగాల పనితీరు మెరుగుపరచడానికి అవయవాలను కదిలించడం చాలా మంచిదని పరిశోధకులు అంటున్నారు.
Also Read : ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: జుట్టు పొడవుగా పెరగాలంటే తులసి ఆకులను ఇలా వాడండి