/rtv/media/media_files/2026/04/25/summer-tips-2026-04-25-17-49-36.jpg)
Summer Tips
Summer Tips: వేసవిలో ఎండలు పెరిగే కొద్దీ శరీరంలో నీరు తగ్గిపోతుంది. ఎక్కువగా చెమట పడటం వల్ల నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో అలసట, నీరసం, కొన్నిసార్లు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. దీని కోసం పాటించాల్సిన సులభమైన చిట్కాలు ఇవి.
1. రోజంతా నీరు తాగడం
దాహం వేసే వరకు వేచి ఉండకుండా తరచుగా నీరు తాగాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది. ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగితే ఇంకా మంచిది.
2. నీరు ఎక్కువగా ఉన్న ఆహారం
వేసవిలో పుచ్చకాయ, కర్బూజా, నారింజ, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కీరదోస, టమాటా, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలు కూడా శరీరానికి నీరు అందిస్తాయి.
3. చల్లని పానీయాలు
మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా సహాయపడతాయి. నిమ్మరసం, పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. నీటిలో నిమ్మకాయ, పుదీనా, దోసకాయ ముక్కలు వేసి తాగితే ఇంకా మంచిది.
4. తినకూడానవి ఇవే
టీ, కాఫీ, శీతల పానీయాలు, ఆల్కహాల్ వంటివి శరీరంలోని నీటిని తగ్గిస్తాయి. అలాగే ఎక్కువగా వేయించిన పదార్థాలు, కారం, మసాలా ఎక్కువ ఉన్న ఆహారం శరీర వేడిని పెంచుతుంది.
5. ఇతర ముఖ్యమైన జాగ్రత్తలు
బయటకు వెళ్లేటప్పుడు నీటి బాటిల్ తీసుకెళ్లాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. రోజంతా నీరు తాగడం మర్చిపోకుండా ఫోన్‌లో రిమైండర్ పెట్టుకోవడం కూడా మంచిది.
ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.
Follow Us