బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు! బిగుతైన లో దుస్తువులు ధరించడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. బిగుతైన బ్రాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. పేలవమైన రక్త ప్రసరణ భుజం, వెన్నునొప్పికి కారణమవుతుంది. అంతేకాదు బిగుతైన బ్రాలు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉంది. By Archana 15 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update inner wear bra షేర్ చేయండి Wearing Tight Bra: ప్రతి అమ్మాయి తమ రొమ్ములను సరైన ఆకృతిలో ఉంచడానికి తగిన బ్రాను ధరిస్తారు. అయితే కొన్ని సార్లు కొంతమంది తెలిసి , తెలియక బిగుతైన బ్రాలు ధరించడం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. చిరోప్రాక్టిక్, ఆస్టియోపతి అధ్యయనంలో ప్రకారం దాదాపు 80శాతం మంది మహిళలు తప్పు సైజు బ్రాలను దరిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో 70 శాంతం మంది మహిళలు చిన్న సైజు బ్రాలు, 10 శాంతం మంది మహిళలు చాలా పెద్ద సైజు బ్రాలు ధరిస్తున్నారు. బిగుతైన బ్రాలు ధరించడం వల్ల కలిగే మరిన్ని నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read: Bengaluru: దర్శన్ బెయిల్‌ను మళ్ళీ కొట్టేసిన బెంగళూరు కోర్టు బిగుతైన బ్రాలు ధరించడం వల్ల కలిగే నష్టాలు క్యాన్సర్ ముప్పు హార్వర్డ్ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక పరిశోధనలో బిగుతైన బ్రాలు ధరించడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తేలింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బిగుతైన బ్రాలు ధరించడం వల్ల మహిళల ఛాతి పై అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చర్మం దద్దుర్లు బిగుతైన బ్రాలు ధరించడం వల్ల చర్మం పై దద్దుర్లు వస్తాయి. బిగుతుగా ఉండే లో దుస్తువులు చర్మానికి అంటుకోవడం ద్వారా బ్రా లైన్ చుట్టు పక్కల చికాకు, దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎసిడిటీ సమస్య బిగుతైన లోదుస్తువులు ధరించడం కొన్ని సార్లు గుండెల్లో మంట, అసిడిటీకి దారితీసే ప్రమాదం ఉంటుంది. టైట్ గా ఉండడం వల్ల ఛాతి పై ఏర్పడి.. యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది.ఇది ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది. Also Read: దీపావళికి మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి... అన్ని సుఖ సంతోషాలే! ఓపెన్ వెంటిలేషన్ లో ఆరబెట్టడం ఎల్లప్పుడూ లోదుస్తువులను సబ్బు సహాయంతో నీటుగా ఉతకాలి. అయితే కొంతమంది ఉతికిన తర్వాత వాటిని వేరే బట్టల కింద ఉంచి.. ఆరబెట్టడం చేస్తుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. బ్రాను ఎల్లప్పుడూ ఓపెన్, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఆరబెట్టాలి. లేదంటే దానిలోని తడి కారణంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. Also Read: PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా! చెడు భంగిమ చాలా మంది మహిళలకు ఈ విషయం తెలియదు. బిగుతైన బ్రాలు ధరించడం శరీర భంగిమను పాడుచేస్తాయి. టైట్ గా ఉండడం వల్ల భుజాలపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. కాలక్రమేణా ఇది శరీర భంగిమను ప్రభావితం చేస్తుంది. అంతే కాదు బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల కొన్నిసార్లు బ్రా లైన్ చుట్టూ దురద, మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Vastu Shastra : ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది! #health-tips #women-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి