Salt: ఉప్పు తింటే ఘోరమైన చా*వు? సంచలన నిజాలు

ఆహారంలో అదనపు ఉప్పు కలపడం ఆరోగ్యాన్ని క్రమంగా ప్రభావితం చేస్తుంది. తాజా అధ్యయనాల్లో దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధకులు ఒక దశాబ్దం పాటు ఆహారంలో అదనపు ఉప్పు వేసుకునే వారిని పరిశీలించగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సంభవం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

New Update
gastric cancer (1)

gastric cancer (1)

Gastric cancer: ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడం ఆరోగ్యాన్ని గమనీయంగా ప్రభావితం చేస్తుంది. అధిక ఉప్పు కారణంగా రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. దీనికి తోడు కొంతమంది వంటలో వేసిన ఉప్పు చాలదని.. మళ్ళీ ఆహారానికి  పై నుంచి అదనపు ఉప్పును జోడించడం చేస్తుంటారు. 

అదనపు ఉప్పుతో కడుపు క్యాన్సర్ ప్రమాదం 

అయితే తాజా అధ్యయనాల్లో మోతాదుకు మించి ఆహారంలో అధిక ఉప్పును జోడించడం పై షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనంలో అదనపు  ఉప్పు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. పరిశోధకులు ఒక దశాబ్దం పాటు ఆహారంలో అదనపు ఉప్పు వేసుకునే వారిని పరిశీలించగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సంభవం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

Also Read:  Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు  471,144 యునైటెడ్ కింగ్‌డమ్ బయోబ్యాంక్ వ్యక్తులను పరిశీలించారు. ఈ పరిశోధనలో ఆహారాలకు అదనపు ఉప్పు కలపడం యొక్క ఫ్రీక్వెన్సీ,  కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఆసియా అధ్యయనాలలో ఆహారంలో ఉప్పు తీసుకోవడం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉన్నట్లు తేలింది.  10.9 సంవత్సరాల మధ్య పరిశోధన వ్యవధిలో మొత్తం 640 గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులను గుర్తించారు. కడుపులో క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే అనేక ప్రమాద కారకాలలో, ఒక అంశం ఉప్పు. ముఖ్యంగా ప్రెసర్వ్డ్ ఫుడ్స్ మళ్ళీ అదనపు సాల్ట్ జోడించడం ఆరోగ్యానికి మంచిది కాదు.  అదనపు ఉప్పును జోడించే బదులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో ఆహార రుచిని పెంచవచ్చు. దీని వల్ల ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉండవు. ఇప్పటికే బయట ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేసిన ఆహారాలు అధిక స్థాయిల్లో సోడియం కంటెంట్ ను కలిగి ఉంటాయి.

Also Read:  Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: గుండె ఆరోగ్యానికి విటమిన్ కె ఎంత అవసరం?

ఇది కూడా చదవండి: ట్రంప్ క్యాబినెట్‌లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి

Advertisment
Advertisment
తాజా కథనాలు