/rtv/media/media_files/2025/02/24/gKF5xUsl8bO5boXyU9m6.jpg)
Food Reheating
Food Reheating: బియ్యంతో సహా 4 ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి మళ్లీ వేడి చేస్తే విషపూరితంగా మారవచ్చంటున్నారు. ఆరోగ్య నిపుణుల నుంచి మన పెద్దలంతా తాజా ఆహారం తినమని సలహా ఇస్తారు. తాజా ఆహారం ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉంచుతుందని నమ్ముతారు. అయితే బిజీ జీవనశైలి కారణంగా రోజుకు రెండు, మూడు సార్లు వంట చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. దీనికి సమయం ఆదా చేయడం ఒక కారణం అయితే ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటం మరొక కారణం.
బ్యాక్టీరియా పెరుగుతుంది:
కానీ కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అవి మళ్లీ వేడి చేసినప్పుడు విషపూరితంగా మారతాయి. బంగాళాదుంపలలో అనేక పోషకాలు ఉన్నప్పటికీ వాటిలో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది మళ్లీ వేడి చేసినప్పుడు చాలా రెట్లు పెరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. చికెన్‌లో సాల్మొనెల్లా ఉంటుంది. ఇది మళ్లీ వేడి చేసినప్పుడు సమస్యలను కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: బాదం నూనె వర్సెస్ కొబ్బరి నూనె.. ఏది మంచిది?
మళ్లీ వేడి చేసినప్పుడు దాని ప్రోటీన్ కూడా మారుతుంది. దీనివల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది. పాలకూర లేదా ఆకుకూరలలో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇందులో నైట్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మళ్ళీ వేడి చేసినప్పుడు ఈ నైట్రేట్లు హానికరమైన నైట్రేట్లుగా మారతాయి. గుడ్లను మళ్లీ వేడి చేసినప్పుడు వాటిలోని అధిక ప్రోటీన్ కంటెంట్ చెడిపోయి విషపూరిత రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. గుడ్లను మళ్లీ వేడి చేయడం వల్ల వాటి ఆకృతి రబ్బరులా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజూ ఈ మూడు తింటే జుట్టు రాలడం తగ్గుతుంది