Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు! వైవాహిక జీవితం ఎలాంటి కలతలు, పరస్పర విభేదాలు రాకుండా ఉండడానికి ఈ 3 విషయాలను పాటించమని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . By Archana 16 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 ప్రతి ఒక్కరి వైవాహిక జీవితం ఒకేలా ఉండదు. కొంతమంది భార్య భర్తల బంధం ప్రేమ, నమ్మకంతో ముడిపడి ఉంటుంది. మరికొంతమందిది అపార్థాలు, అపోహలు, అనుమానాలతో నిండి ఉంటుంది. పరస్పర విభేదాలు భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. సంబంధాన్ని విచ్చిన్నం చేస్తాయి. వైవాహిక జీవితం ఇలాంటి కలతలు రాకుండా ఉండడానికి ఈ 3 విషయాలను పాటించండి 2/6 సమయం కేటాయించడం వైవాహిక బంధాన్ని దృడంగా ఉంచుకోవడానికి భాగస్వామి కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. నేటి బిజీ లైఫ్ లో చాలా ఆఫీస్ పనులు, ఇంటి పనులు అంటూ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసేవారైతే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం వారికి సవాలుగా మారుతోంది. ఇది భార్యాభర్తల మధ్య దూరానికి కారణమవుతుంది. బంధాన్ని బలహీనపరుస్తుంది. కావున భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. 3/6 ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసేవారైతే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం వారికి సవాలుగా మారుతోంది. ఇది భార్యాభర్తల మధ్య దూరానికి కారణమవుతుంది. బంధాన్ని బలహీనపరుస్తుంది. కావున భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. 4/6 కూర్చొని మాట్లాడుకోవడం భార్య భర్తల మధ్య ఏవైనా మనస్పర్థలు లేదా పరస్పర విభేదాలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు గొడవపడటం మానేసి.. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే భాగస్వామి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే.. వారి పై విసుగు చెందడానికి బదులుగా.. వారికి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సంబంధంలో చీలికను సృష్టిస్తాయి. 5/6 తప్పును అంగీకరించండి ప్రతి ఒక్కరు జీవితంలో తెలిసి లేదా తెలియక తప్పులు చేయడం సహజం. అలా మీ భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ పై కోప్పడడం, అరవడం చేస్తుంటారు. 6/6 ఇలాంటివి జరిగినప్పుడు మీ పార్ట్నర్ మనసు గాయపడినట్లైతే వారికి సారీ చెప్పడంలో ఆలస్యం చేయకండి. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం ద్వారా ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అలాగే బంధం బలపడుతుంది. #life-style #wife and husband relationship #married-couples మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి