వీటి వల్ల నిద్రలేవగానే తలనొప్పి విపరీతంగా ఉంటుంది..! జాగ్రత్త ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అసలు ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకుందాం. By Archana 30 Sep 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update morning headache షేర్ చేయండి 1/8 నిద్రలేమి సరైన నిద్ర లేకపోవడం కూడా ఉదయాన్నే తలనొప్పికి కారణమవుతుంది. రోజు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. అంతే కాదు ఎక్కువగా నిద్ర పోవడం కూడా తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 2/8 ఒత్తిడి తలనొప్పి, నిద్ర రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. నిద్ర లేకపోవడం, టెన్షన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు నిద్రను కష్టతరం చేసి తలనొప్పికి దారితీస్తాయి. 3/8 స్లీప్ అప్నియా అధ్యయనాలు ప్రకారం స్లీప్ అప్నియా సమస్యతో బాధపడేవారు కూడా ఉదయం లేవగానే తలనొప్పిని అనుభవిస్తారని నివేదికలు చెబుతున్నాయి. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన స్లీప్ డిజార్డర్, దీనిలో శ్వాస ఆగిపోవడం, గట్టిగా గురక పెట్టడం వంటివి జరుగుతాయి. పూర్తి నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంది. 4/8 మైగ్రేన్ మైగ్రేన్, ఆల్కహాల్ హ్యాంగ్ ఓవర్ వల్ల కూడా ఉదయం నిద్రలేవగానే తలనొప్పి వస్తుంది. 5/8 నిద్ర షెడ్యూల్ ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి సమస్యను నివారించడానికి మంచి నిద్ర షెడ్యూల్ను పాటించడం చాలా ముఖ్యం. ప్రతీ రోజు ఒకే సమయంలో పడుకొని, మేల్కోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 6/8 డీహైడ్రేషన్ మంచి ఆహరం, తగినంత హైడ్రేషన్ కూడా ఈ సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. రోజు కనీసం 2 లీటల నీళ్ల అయిన తీసుకోవాలి..అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 7/8 యోగ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య తగ్గకపోతే.. జీవన శైలిలో మార్పులు అలవాటు చేసుకోండి. ఉదయాన్నే కాస్త సమయం యోగ, వ్యాయామం, చల్లని గాలిలో తిరగడం చేయండి. 8/8 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #human-life-style #health-issues #insomnia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి