కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం పవిత్రమైన కార్తీకమాసంలో నదీ స్నానాలు చేయడం, శివుడిని భక్తితో పూజించడం, అన్నదానం, వస్త్ర దానం వంటివి చేస్తే సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కార్తీకంలోని నాలుగు సోమవారాలు ఉపవాసం ఆచరించి శివుడిని పూజిస్తే మంచి జరుగుతుంది. By Kusuma 03 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. సకల పాపాలు తొలగిపోతాయి.. ముఖ్యంగా ఈ నెలలో దీపారాధన చేసి శివుడిని నియమనిష్టతో పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరిక కోరికలు నెరవేరి అంతా మంచి జరగాలంటే కార్తీక మాసంలో కొన్ని పనులు చేయాలి. ఈ నెలలో ఎక్కువగా నదిస్నానం చేయాలి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ కార్తీక మాసంలో అన్నదానం, వస్త్ర దానం వంటివి తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ మాసంలో శివుడిని, మహా విష్ణువుని భక్తితో పూజించాలి. ఉదయం, సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. అలాగే ఈ నెలలో చేసే దీపారాధన కోటి జన్మల పుణ్యఫలం ఇస్తుందని పండితులు అంటున్నారు. ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య కార్తీక నెలలో మొత్తం నాలుగు సోమవారాలు వస్తాయి. ఈ నాలుగు రోజులు కూడా తప్పకుండా శివుడిని దర్శించుకుని, ఉపవాసం ఆచరించాలి. ఉపవాసం చేయలేని వారు కనీసం ఒక పూట భోజనం అయిన పాటిస్తే ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది. ఇది కూడా చూడండి: Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పండితులను సంప్రదించి సూచనలు తీసుకోవడం ఉత్తమం. #karthika masam 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి