Vijayadashami Festival: దసరా రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు దసరా జరుపుకునే సంప్రదాయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. చెడుపై మంచి విజయం సాధించిన పండుగని అంటారు. ఈ రోజుల్లో పాత పగలను మరచిపోయి, ప్రియమైన వారిని ఆలింగనం చేసుకోవడం ద్వారా సంబంధాలను మళ్లీ బలపరుచుకునే సంప్రదాయం పురాతనకాలంగా వస్తోంది. By Vijaya Nimma 11 Oct 2024 | నవీకరించబడింది పై 12 Oct 2024 10:27 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Vijayadashami Festival షేర్ చేయండి Vijayadashami Festival: హిందువుల అతి ముఖ్యమైన పండుగలో దసరా ఒకటి. అశ్వినీ మాసంలో శుక్ల పక్షంలోని పదవ రోజున దసరాను జరుపుకుంటారు. భారతదేశం అంతటా గొప్ప వైభవంగా, ఎంతో కోలాహలంగా ఈ పండగ చేసుకుంటారు. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించిన పండుగ అని కూడా అంటారు. దసరా జరుపుకునే సంప్రదాయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. అయితే దసరా రోజున చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. నుదుటిపై తిలకం పెట్టుకునే సంప్రదాయం: రామ-లక్ష్మణ, సీతాదేవి, ఆంజనేయ స్వామి, నవదుర్గా దేవి, అపరాజితను దసరా రోజు పూజిస్తారు. ఉదయం చెట్లు, వాహనాలు, ఆయుధాలను శుభ్రం చేసి పూజ జరిపిస్తారు. దసరా పండుగ రోజున అరలిచెట్టు, జమ్మిచెట్టు, మర్రిచెట్టు కింద, గుడిలో దీపాలు వెలిగించే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. దుర్గా సప్తశతి లేదా చండీ పథ, హవన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దసరా పండుగ రోజున కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి రావణ దహన దర్శనానికి వెళ్తారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో నుదుటిపై తిలకం పెట్టుకునే సంప్రదాయం ఉంది. ఇది కూడా చదవండి: జుట్టు నల్లబడటానికి ఆయుర్వేద మార్గాలివే ఈ రోజుల్లో పాత పగలను మరచిపోయి, ప్రియమైన వారిని ఆలింగనం చేసుకోవడం ద్వారా సంబంధాలను మళ్లీ బలపరుచుకునే సంప్రదాయం పురాతనకాలంగా వస్తోంది. దసరా రోజున పిల్లలకు డబ్బు, బట్టలు లేదా మిఠాయిలు, బహుమతులు ఇస్తారు. విజయదశమి రోజు రావణ దహనం నుంచి తిరిగి వచ్చాక జమ్మి ఆకులను స్నేహితులకు ఇచ్చి ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇంటికి వెళ్లిన తర్వాత పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు. జమ్మి చెట్టు అనేది విజయానికి సూచిక అంటుంటారు. అందుకే జమ్మి ఆకులను అందరికీ పంచుతారు. ఇది బంగారంతో సమానం అంటారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: మానసిక సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయి..? #vijayadashami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి