వినికిడి సమస్య ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇకపై ఇలా చేస్తే అన్నీ వినపడతాయి!

వినికిడి లోపంతో బాధపడేవారికి IIT హైదరాబాద్‌ PhD విద్యార్థులు నీల్‌షా, నేహా సాహిప్‌జాన్, విశాల్‌ తంబ్రహళ్లి శుభవార్త అందించారు. గుసగుసలు సైతం వినిపించేలా 'స్టెతస్కోప్‌' అనే పేరుతో ఓ పరికరాన్ని తయారు చేశారు. దీన్ని చెవి వెనుక పెట్టుకొని మొబైల్ బ్లూటూత్ తో ఆపరేట్ చేయొచ్చని తెలిపారు.

New Update
deaf (1)

Earing equipment

Earing Aid:  వినికిడి లోపం అనేది శిశువుల నుంచి ఏ వయసు వారిలోనైనా సంభవిస్తుంది.  పెద్ద శబ్దాలు వినడం, ఓటోటాక్సిసిటీ, ఇన్ఫెక్షన్, గాయాలు ఇలా  చాలా విషయాలు వినికిడి లోపానికి కారణం కావచ్చు.  ఇలాంటి సమస్యతో బాధపడేవారకి ఎదుటి వారు ఏం చెబుతున్నారో అర్థం కాక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇలా వినికిడి లోపం ఉన్నవారి కోసం ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల వినికిడి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 

Also Read: వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే?

ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల 'స్టెతస్కోప్‌'

అయితే తాజాగా ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ విద్యార్థులు నీల్‌షా, నేహా సాహిప్‌జాన్, విశాల్‌ తంబ్రహళ్లి వినికిడి లోపంతో బాధపడేవారి కోసం 
మరో సరికొత్త పరికరాన్ని తయారు చేశారు. గుసగుసలు సైతం వినిపించేలా 'స్టెతస్కోప్‌' అనే పేరుతో కొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. దీన్ని చెవి వెనుక పెట్టుకొని మొబైల్ బ్లూ టూత్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని తెలిపారు.

Also Read: BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!

‘స్టెతోస్పీచ్‌.. స్పీచ్‌ జనరేషన్‌ త్రూ క్లినికల్‌ స్టెతస్కోప్‌ అటాచ్డ్‌ టు స్కిన్‌' పేరుతో రూపొందించిన ఈ పరిశోధనను.. ఇటీవలే  మెల్‌బోర్న్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించారు. సైంటిస్ట్  స్టీఫెన్‌ హాకింగ్‌ స్ఫూర్తితో విద్యార్థులు ఈ వినికిడి పరికరాన్ని రూపొందించినట్లు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ వినీత్‌ గాంధీ తెలిపారు.  సాధారణ స్టెతస్కోప్‌ టెక్నాలజీకి ఆధునిక సాంకేతికత  జోడించి.. 'విష్పర్‌-స్పీచ్‌ డేటా' ను అనుసంధానించినట్లు చెప్పారు. ఇప్పటికే మార్కెట్లు అందుబాటులో ఉన్న ఇయరింగ్ మిషన్ల కంటే..  ఇది 100 రెట్లు అత్యాధునికంగా ఉంటుందని వివరించారు. ఎదుటి వారు ఏం చెబుతున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నవారికి ఈ పరికరం  చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. 

Also Read: జైల్లో 2 నిమిషాల పాటు పవన్ ఏం చెప్పాడంటే.. 'అన్‌స్టాపబుల్‌' ప్రోమోలో బాబు సంచలనం!

Also Read: BIG BREAKING: బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు !

Advertisment
Advertisment
తాజా కథనాలు