గొంతులో ఏదైనా ఇరుక్కుందా..అయితే కంగారు పడొద్దు..ఇలా చేయండి చాలు! గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు...బయటకి రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులో వెళ్లు పొనిచ్చి ఏదైనా అడ్డు ఉంటే వెంటనే తీసేయాలి.రెండు చేతులను పొట్ట చుట్టూ గట్టిగా బిగించి కదిలించాలి. క్రమంగా ఆ పట్టును పొట్ట పై కింది భాగం నుంచి పైకి కదల్చాలి. By Bhavana 24 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Health Tips: గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు వెంటనే కంగారు పడిపోయి..బాధిత వ్యక్తిని కూడా కంగారు పెట్టేయకూడదు. మనం తిన్న ఆహారం కిందకి కదలడానికి వీలుగా తల మీద కొడుతుంటారు. అయితే ఆ ఆహారం కడుపులోకి దారి తీసే ఆహార నాళంలోకి కాకుండా ...ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. Also Read: షర్మిల, జగన్ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు కాబట్టి ఆ ఆహరం బయటకి రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని సదరు వ్యక్తి నాలుక చాపేలా చేసి...వారి గొంతులో వెళ్లు పొనిచ్చి ఏదైనా అడ్డు ఉంటే వెంటనే తీసేయాలి. గొంతుకు ఏదైనా అడ్డం పడి బాధ పడుతున్న వ్యక్తి వెనక మనం ఉంది..మన రెండు చేతులను పొట్ట చుట్టూ గట్టిగా బిగించి కదిలించాలి. క్రమంగా ఆ పట్టును పొట్ట పై కింది భాగం నుంచి పైకి కదల్చాలి. Also Read: 4.5 కిలోల గోల్డ్..కోట్లలో..ప్రియాంక ఆస్తుల వివరాలివే! దీని వల్ల పొట్ట లోపల ఒత్తిడి పెరిగి, అది పై భాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నెట్టేసే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల గొంతులో ఏదైనా ఆహారం ఇరుక్కుంటే వారిని కాళ్ల పై బోర్లా పడుకోబెట్టుకోవాలి. తల కిందకి ఉండేలా చూసుకోవాలి. Also Read: బెంగళూరులో ట్రాఫిక్ జామ్..వాహనాలు వదిలేసి నడుచుకుంటూ! ఒత్తిడి తీసుకుని వస్తే... వీపు పై ఒకేసారి ఒత్తిడి తీసుకుని వస్తే మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి అది పైకి పాకి గొంతుకు అడ్డం పడిన పదార్థం బయటకు వచ్చే అవకాశాలుంటాయి. ఇలా పడుకోబెట్టి ఆకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేటప్పుడు ఆ కదలికలను పై వైపునకు అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే, గొంతులో ఇరుక్కున్న పదార్థం బయటకు వచ్చే అవకాశాలున్నాయి. Also Read: స్వరూపానందపై విచారణ..? షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం పైవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ వైద్యులు లారింగోస్కోపీ అనే పరికరం తో గొంతును పరీక్షించి అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి