Home Tips: ఒంటికి వాడే సబ్బును ఇంటికి వాడండి ఇలా ఇంట్లో సబ్బు ముక్కలు మిగిలిపోవడం సహజమే. వాటిని బయట పడేస్తూ ఉంటారు. నిజానికి సబ్బు ముక్కలను పడేయాల్సిన అవసరం లేదు, వాటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. వాడి పడేసిన సబ్బు ముక్కలను ఇంట్లో ఎలా తిరిగి వాడాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Soap షేర్ చేయండి Home Tips: మార్కెట్లో ఎన్ని లిక్విడ్ సబ్బులు వచ్చినా, సాధారణ సబ్బులను వాడే వారి సంఖ్య ఎక్కువే. ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో సబ్బులనే వాడతారు. స్నానం చేసేటప్పుడు సబ్బు చాలా వరకు అరిగిపోయి చివరికి చిన్న ముక్కలు మిగిలిపోతాయి. వాటిని పడేయాల్సిన అవసరం లేదు. వీటిని ఉపయోగించి ఇంటిని మెరిపించేయచ్చు. ఇంట్లో చెక్క తలుపులు ఉంటాయి. అవి జామ్ అయిపోవడం వంటివి జరుగుతున్నాయి. అవి ఒక్కోసారి తెరిచినప్పుడు శబ్ధాలు చేస్తూ ఉంటాయి. సబ్బు ముక్క సహాయంతో ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు. చిన్న సబ్బు ముక్కతో సువాసన: జామ్ అయిన తలుపులు లేదా స్లైడర్లకు సబ్బును రాయండి. ఇలా చేయడం వల్ల డోర్లు లేదా స్లైడర్లు బాగా తిరుగుతాయి. ఎలాంటి శబ్ధాలు రావు. ఒక చిన్న సబ్బు ముక్కను వార్డ్ రోబ్ ఫ్రెషనర్ లేదా క్లాసెట్ ఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. సువాసనలు వెదజల్లే సబ్బు ముక్కలను విసిరే బదులు, వాటిని ఒక వస్త్రంలో లేదా టిష్యూ పేపర్లో చుట్టి, వాటిని అల్మారా లేదా క్లాసెట్ లోపల ఉంచాలి. దీంతో ఎంతో సువాసన వస్తుంది. చాలాసార్లు తాళాలు పాతవి అయినప్పుడు, వాటిని తెరవడం కొంచెం కష్టమవుతుంది. తాళాలు సులభంగా తెరుచుకోవు. వాటిని తెరవడానికి చాలా బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ఈ కాయలు తింటే మధుమేహం దరిచేరదు ఈ సందర్భంలో సబ్బును కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా సబ్బుపై తాళం చెవిని కొద్దిగా రుద్దాలి. ఇప్పుడు ఈ సబ్బు కోటెడ్ కీని తాళం కప్పలో ఉంచాలి. దాన్ని తెరిచి పదేపదే మూసివేస్తూ ఉండాంలి. ఇలా చేయడం వల్ల తాళాలు బాగా పనిచేస్తాయి. చాలాసార్లు ప్యాంటు, జాకెట్, బ్యాగ్ జిప్‌లు సరిగా పనిచేయవు. ఒక సబ్బు ముక్కను తీసుకొని జిప్ మీద రుద్దాలి. ఆపై జిప్ తెరిచి మూసి వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జిప్ ఫిక్స్ అవుతుంది. ఇలా సబ్బుముక్కలతో మీ ఇంట్లోని పరికరాలను పనిచేసేలా మార్చుకోవచ్చు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ప్రతి ఒక్కరూ 40 ఏళ్ల లోపు ఈ 20 పనులు చేయాలి #home-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి