/rtv/media/media_files/2025/03/22/FI9ogDmSAWz1GyGXxOIy.jpg)
Hemlock water dropwort plant
Hemlock water dropwort: 'చిరునవ్వుతో చంపే మొక్క'.. ఇలాంటి మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా. ఇది మృతుడి మొహం పై చిరునవ్వు ఉండేలా చేస్తుంది. 'హెమ్లాక్ వాటర్ డ్రాప్‌వోర్ట్' అని పిలవబడే ఈ మొక్క అడవిలో కనిపించే అత్యంత అసాధారణమైన మొక్కల్లో ఒకటి. ఇది సార్డినియా వంటి అడవి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ మొక్క ప్రాణాలకే ప్రమాదం. దీనిలోని విషపూరిత లక్షణాలు ఒక వ్యక్తిని పారలైజ్ చేసి.. మరణానికి కారణమవుతాయి. అయితే దీనివల్ల వచ్చే మరణం సాధారణంగా ఉండదు. ప్రమాదవశాత్తు ఈ మొక్కను తీసుకుంటే, ఫేస్ పెరాల్సిస్ సంభవించి.. వ్యక్తి ముఖం నవ్వుతున్నట్లు కనిపించే విధంగా కుంచించుకుపోతుంది. అందుకే దీనిని 'చిరునవ్వుతో చంపే మొక్క' అని కూడా అంటారు.
ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
పురాతన ఆచారం
అంతేకాదు ఈ మొక్క వెనుక ఓ పురాతన ఆచారం కూడా దాగి ఉంది. అయితే అప్పట్లో సార్డీనియాలో సమాజానికి భారంగా భావించే వృద్ధులను చంపేయడానికి ఈ మొక్కను ఉపయోగించేవారట. దీని తీసుకున్న తరువాత, బాధితులు మరణానికి గురవుతారు. ఎంతో అందంగా కనిపించే 'హెమ్లాక్ వాటర్-డ్రాప్‌వోర్ట్' దాని ప్రాణాంతక లక్షణాల కారణంగా అపఖ్యాతి పాలైనప్పటికీ.. కొంతమంది శాస్త్రవేత్తలు దీని విషాన్ని ఉపయోగించి వైద్య చికిత్సలు చేయాలని పరిశోధిస్తున్నారు.
Attractive but DEADLY - one of the UK's most poisonous plants, Hemlock Water Dropwort (Oenanthe crocata) dangerous as its leaves look like flat-leaved parsley or celery.
— Lydia Massiah 📕🌿🍄 (@lydia_massiah) May 21, 2020
Up to 6ft tall, it grows by water & in damp areas & is starting to flower now.#wildflowerhour #staysafe pic.twitter.com/1Pv8JvaRBe
మెడిసినల్ బెనిఫిట్స్
సాధారణంగా పక్షవాతాన్ని ప్రేరేపించే ఈ మొక్కలోని విషపూరిత పదార్థాలను.. పక్షవాతం చికిత్సకు, ఇతర పరిస్థితులకు ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కండరాలను సడలించడానికి, కండరాల సమస్యలు లేదా నరాల గాయాలను బహుకాలంగా చికిత్స చేయడంలో ఈ మొక్క ఉపయోగపడవచ్చని డాక్టర్ మౌరో బల్లెరో వంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.
life-style | health | Hemlock water dropwort plant
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...