Health Tips: శీతాకాలంలో ఈ పాలు తాగితే ఎలాంటి రోగాలు రావు..! పసుపులో జీర్ణ ఎంజైమ్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడతాయి. అలాగే తిన్న ఆహరం ఆగిరిపోయేందుకు పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి. By Bhavana 03 Nov 2024 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Winter Health Tips: దేశ వ్యాప్తంగా శీతాకాలం మొదలైంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇలాంటి చల్లని వాతావరణంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా వరకూ ఏదోక అనారోగ్యం బారిన పడుతూంటారు. అలాంటి వారు పసుపు పాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపు పాలలో ఉండే ఔషధ గుణాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే ఈ పసుపు పాలు తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందుతాము, ఏ విధంగా ఆ పాలను తయారు చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బలపడుతుంది... పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మనిషి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీని కారణంగా ఈ శీతాకాలంలో మనిషి తరుచుగా ఎదుర్కొనే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తుంది. అలాగే ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతో సహాయాన్ని అందిస్తుంది. కీళ్ల సమస్యలు దూరం.. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. అదే సమయంలో పాలలో కాల్షియం ఉంటుంది. ఇవి కీళ్ల వాపును తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుకునేందుకు, ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఆర్థరైటిస్ వంటి దీర్ఘ కాలిక సమస్యలతో బాధ పడే వ్యక్తులు ఈ పాలను తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితాలను చూడొచ్చు. జీర్ణ వ్యవస్థ కోసం.. పసుపులో జీర్ణ ఎంజైమ్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడతాయి. అలాగే తిన్న ఆహరం ఆగిరిపోయేందుకు పసుపు పాలు ఎంతగానో సహాయపడుతుంది. కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు ఈ ఒక్క పాలతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికి.. ఈ పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అలాగే ముఖంపై ఇతర మొటిమలు, మచ్చలు, ఇతర ఏదైనా సమస్యలు ఉన్నా దానికి మంచి ఔషధం.. మొత్తానికి చెప్పాలంటే చర్మం కాంతి వంతంగా, నిగనిగలాడుతోంది. మంచి నిద్ర కోసం.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. చేస్తున్న పనిలో కావచ్చు, వేరే ఏదైనా కార్యక్రమంలో ఈ నిద్రలేమి సమస్య కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటూంటారు. అలాంటి వ్యక్తులు ఈ పసుపు పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ పసుపు పాలలో మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా క్రమంగా నిద్ర నాణ్యత పెరిగి, నిద్ర సుఖంగా పడుతుంది. అందుకే రాత్రి పూట పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటే మంచిదని పలువురు చెప్తుంటారు. పసుపు పాలను ఎలా చేసుకోవాలంటే.. ముందుగా ఒక గ్లాస్ పాలను ఒక గిన్నెలో వేసుకొని బాగా మరించుకోవాలి. అనంతరం అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం ఘాటుగా ఉండే నల్ల మిరియాలు కలుపుకుంటే మంచిది. ఇందులో ఉండే ఘాటు గుణం ఇతర సమస్యలను పోగొట్టడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు సహాయపడుతుంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి