/rtv/media/media_files/2025/04/14/summarfood9-214123.jpeg)
వేసవి కాలంలో శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఆహార నియమాలను పాటించడమూ అంతే అవసరం. ఎండాకాలంలో తినే ఆహారం శరీర వేడిని ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడతే, మరికొన్నివి వేడిని పెంచుతూ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే వేసవిలో ఆహార విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
/rtv/media/media_files/2025/04/14/summarfood6-704289.jpeg)
మాంసాహారం వాడకాన్ని ఈ కాలంలో తగ్గించుకోవడం మంచిది. చికెన్, ఫిష్, మటన్ లాంటి మాంసాహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే చెమట ఎక్కువగా వస్తుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అంతేకాదు, జీర్ణ సంబంధిత సమస్యలు మరియు డయేరియా లాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/04/14/summarfood1-549469.jpeg)
అలాగే మసాలాలు అధికంగా కలిగిన భోజనం వేసవిలో తినకూడదు. ఇవి శరీర వేడిని మరింత పెంచుతాయి. ఆ సమయంలో ఆయిల్ ఎక్కువగా ఉండే, వేయించిన పదార్థాలు కూడా తినడం మానుకోవాలి. ఇవన్నీ శరీరంలోని నీటిని తగ్గించి డీహైడ్రేషన్‌ను పెంచే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/04/14/summarfood8-504646.jpeg)
వాటితో పాటు ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ స్నాక్స్, వాటిలో ఉండే అధిక ఉప్పు, ఆయిల్ వల్ల ఆరోగ్యానికి హానికరం. ఇవి తినే బదులు తాజా పండ్లు, కూరగాయల ముక్కలు తీసుకోవడం ఉత్తమం. అలాగే వివిధ రకాల సాస్ లతో తయారయ్యే ఆహారం వేసవిలో జీర్ణం కావడంలో ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
/rtv/media/media_files/2025/04/14/summarfood3-971129.jpeg)
వేసవిలో ఆల్కహాల్ తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. ఇది బాడీని వేడిగా చేసి నీటి కొరతకు దారి తీస్తుంది. అదే విధంగా కోక్, కెఫైన్ కలిగిన డ్రింక్స్‌కి బదులు సహజమైన పండ్ల రసాలు తాగడం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో చక్కెర లేకుండా ఉండే జ్యూస్‌లు ఉత్తమమైన ఎంపిక.
/rtv/media/media_files/2025/04/14/summarfood2-741949.jpeg)
వేసవిలో సాధారణ అలవాట్లే అనిపించవచ్చు కానీ, వాటిని అనుసరించకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. అందుకే తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండటం ద్వారా వేడి నుంచి కాపాడుకోవచ్చు.
/rtv/media/media_files/2025/04/14/summarfood10-754559.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.