Cold: ఇలా చేశారంటే ముక్కు కారడం వెంటనే ఆగిపోతుంది

జలుబు చేసినప్పుడు నిద్ర పోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముక్కు కారడం, తుమ్ములతో అస్సలు నిద్ర పట్టదు. పక్కకు తిరిగి పడుకోవడం, వేడి ద్రవపదార్థాలు తినటం, ఉప్పు నీళ్లు తాగటం, ఉప్పునీరు పుక్కిలించటం వంటి చిట్కాలు పాటిస్తే మాత్రం వెంటనే ఉపశమనం ఉంటుంది.

New Update
Common cold

Cold

Cold: జలుబు చేసినప్పుడు నిద్ర పోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముక్కు కారడం, తుమ్ములతో అస్సలు నిద్ర పట్టదు.  కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం వెంటనే ఉపశమనం దొరుకుతుంది. జలుబు చేసినప్పుడు తలకింద దిండు పెట్టుకోవడం మర్చిపోవద్దు. అవసరమైతే రెండు దిండ్లు పెట్టుకోవచ్చు. దీంతో తల కాస్త ఎత్తులో ఉండి శ్లేష్మం సాఫీగా కిందికి వెళ్లిపోతుంది. ముక్కులో శ్వాస తీసుకోవడం సులువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  జలుబు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పక్కకు తిరిగి పడుకోవడం:

  • వెళ్లకిలా పడుకుంటే ముక్కు బ్లాక్ అవుతుంది. అందుకే ఒక పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస చాలా సులువుగా తీసుకోవచ్చు. అలాగే ఎడమ వైపు నాసిక బ్లాక్ అయినట్లు అనిపిస్తే కుడివైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు బ్లాక్ అయితే ఎడమవైపు పడుకోవాలి. ఒక నిమిషంలో సులువుగా శ్వాస తీసుకుంటారు. దగ్గు కూడా రాదని నిపుణులు అంటున్నారు.

వేడి ద్రవపదార్థాలు:

  • పడుకునే ముందు ఏదైనా కాస్త వెచ్చని పానీయాలు తాగాలి. వేడి సూప్ తాగడం, వేడిగా హెర్బల్ టీ తాగడం, లెమన్ టీలో తేనె వేసుకుని తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే ఆవిరి పట్టినా కూడా ఉపశమనం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఇంట్లో ఇలా చేస్తే జిమ్‌కు వెళ్లే అవసరం ఉండదు

ఉప్పు నీళ్లు:

  • ఒక నాసికలో ఉప్పు నీళ్లు పోస్తే మరో నాసిక నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఒక రకంగా ముక్కు శుభ్రపడుతుంది. దీంతో జలుబు తగ్గుతుంది. దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడేవాళ్లు ఈ జలనేతి ప్రక్రియ ప్రయత్నించవచ్చు.

ఉప్పునీరు పుక్కిలింత:

  • గొంతులో ఉండే ఇన్ఫెక్షన్, జలుబు ఉప్పునీటిని పుక్కిలించడం వల్ల తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు ఓసారి గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి గరగరమని పుక్కిలించాలి. అలాగే కొన్ని ఉప్పు నీళ్లు తాగినా కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చక్కెరతో ఇలా చేశారంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు