ఉదయాన్నే ఈ గింజల నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో? రోజూ ఉదయం పూట కలోంజి వాటర్‌ను తాగితే మలబద్దకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వీటిలో ఉండే పోషకాల వల్ల బరువు అదుపులో ఉండటంతో పాటు గుండె ప్రమాదాల నుంచి కూడా విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 19 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు మన వంటింట్లోనే సగం ఉంటాయి. అలాంటి వాటిలో జీలకర్ర ఒకటి. వీటిని కూరల్లో ఎక్కువగా వాడుతారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు జీలకర్ర వాటర్‌ను కూడా తాగుతారు. అయితే ఇందులో నల్ల జీలకర్ర ఉంటాయి. వీటిని కలోంజి సీడ్స్ అని అంటారు. సాధారణ జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఈ కలోంజి గింజల వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. ఇది కూడా చూడండి: Karimnagar: అర్థరాతి ఎమ్మెల్యేకు నగ్న వీడియో కాల్.. తర్వాత ఏమైందంటే? మలబద్దకం నుంచి విముక్తి.. ఎన్నో ఖనిజాలు, పోషకాలు కలోంజీ సీడ్స్‌లో ఉంటాయి. ఈ కలోంజీ వాటర్‌ను తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బరువు అదుపులో ఉండటంతో పాటు మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే కలోంజి వాటర్‌ను తాగితే పొట్ట క్లియర్ అవుతుంది. ఇవి బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చూడండి: పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా.. రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం! కొందరు కడుపు ఉబ్బసం, అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కలోంజి సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కొందరు ఈ గింజలను బ్లాక్ టీతో కలిపి తాగుతుంటారు. ఇది కూడా చూడండి: Putin: ఇండియన్ సినిమాలంటే మాకు ఎంతో ఆసక్తంటున్న రష్యా అధ్యక్షుడు! ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే మెటబాలిజంను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతుంది. కిడ్నీల ఆరోగ్యా కాపాడటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. ఇది కూడా చూడండి: బాలయ్య కాళ్లు మొక్కిన హోమ్ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #kalonji-seeds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి