ఉదయాన్నే అంజీర్ పండ్లు ఇలా తింటే.. సమస్యలన్నీ పరార్ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. డైలీ పరగడుపున వీటిని తింటే జీర్ణ సమస్యలు, క్యాన్సర్, మలబద్దకం, ఆస్టియోపోరోసిస్, బోలు ఎముకల వ్యాధి, గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. By Kusuma 11 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైఫూట్స్ తప్పనిసరి డైట్లో ఉండాలి. అయితే డ్రైఫూట్స్‌లో అంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని డైలీ తినడం వల్ల లాభాలే కానీ.. నష్టాలు లేవని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంజీర్‌ను నానబెట్టి ఉదయం తినాలా? లేకపోతే అలానే తినడం ఆరోగ్యానికి మంచిదా? అనే విషయాలు తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: ఏపీలో స్విగ్గీకి బిగ్ రిలీఫ్.. నో బ్యాన్ నానబెట్టి ఉదయాన్నే తింటే.. ఆరోగ్యానికి మేలు చేసే అంజీర్ పండ్లను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే పరగడుపున అంజీర్‌ను తినడం మంచిది. వీటిని తినడం వల్ల ఉదయం పూట అలసట, నీరసం అన్ని పోయి రోజంతా.. యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీనడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోవడంతో పాటు మలబద్దకం కూడా పోతుంది. అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిరోధించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి విముక్తి కూడా కల్పిస్తుంది. ఇది కూడా చూడండి: బిజినెస్ పేరుతో రూ.229 కోట్ల భారీ మోసం.. వేల సంఖ్యలో బాధితులు అంజీర్‌లో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పొటాషియం, విటమిన్ కే, ఏ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ రాకుండా ఉంచడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులోని కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఆస్టియోపోరోసిస్, బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది. పిల్లలు రోజూ వీటిని తినడం వల్ల బలంగా తయారవుతారు. ఇది కూడా చూడండి: ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ నెల 14 నుంచి.. #anjeer-fruit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి