china: అరచేతి స్కానింగ్‌!

మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా 'అరచేతి స్కానింగ్'తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు.

New Update

చైనా అంటే సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు. చైనీయుల సాంకేతిక నైపుణ్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా 'అరచేతి స్కానింగ్'తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. ఈ పద్ధతికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెర వైరల్‌గా మారింది.

Also Read:  బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లలో కొంతమంది ఈ సాంకేతికతపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే కొందరు మాత్రం అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నారు. తమ దేశాలలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బావుంటుందని ఇంకొందరు కామెంట్ చేశారు.

Also Read: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు