చలికాలంలో ఈ ఆయిల్‌ వాడితే.. పొడి చర్మం సమస్య క్లియర్

చలికాలంలో స్కిన్‌కి ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. స్నానం చేసే ముందు చర్మానికి ఆముదం అప్లై చేసి మర్దన చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Astor Oil: ఆముదం నూనెను ఇలా వాడితే హెల్త్‌కి ఎన్నో ప్రయోజనాలని తెలుసా..?

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొందరు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని వాడుతుంటారు. అయిన కూడా చర్మం పొడిబారడం వంటి సమస్యలన్ని వస్తాయి. శీతాకాలంలో చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ సహజ చిట్కాలెంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి. 

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

ఆముదం ఆయిల్‌ను చర్మానికి..

చలికాలంలో చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఆముదం ఆయిల్‌ను అప్లై చేయడం మంచిది. స్నానం చేసే ముందు దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ తేమగా ఉంటుంది. చర్మంపై ఉండే మచ్చలు,  మొటిమలు, ముడతలు తగ్గిపోవడంతో పాటు పొడిబారకుండా ఉంటుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి.

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఆముదం వల్ల చర్మం మాత్రమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు జుట్టు బలంగా పెరిగేలా చేస్తాయి. అలాగే జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తాయి. తలస్నానం చేసే ముందురోజు జుట్టుకు ఆముదం అప్లై చేస్తే.. కురులు దృఢంగా తయారవుతాయి. ఆముదాన్ని జుట్టుకు అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు వేళ్లతో నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోకుండా బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు