Bathukamma: ఒకప్పుడు బాధతో బతుకమ్మ ఆడేవారు..ఎందుకో తెలుసా? తెలంగాణ బతుకమ్మ వేడుక వెనుక విషాద గాథ ఉంది. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వాళ్ల ఆకృత్యాలతో నలిగిపోయిన వారిని తలుచుకుంటూ తోటి మహిళలు గుర్తుగా పూలను పేర్చి బతుకు అమ్మా అని దీవిస్తూ పాటలు ఆలపించేవారు. By Vijaya Nimma 03 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Bathukamma షేర్ చేయండి Bathukamma: తెలంగాణ సామాజంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో అమ్మని కొలిచే అద్భుతమైన వేడుక ఇది. బతుకమ్మను తెలంగాణ నేలకు తోబుట్టువులా భావిస్తారు. పూలనే దేవతగా కొలిచే అరుదైన, అపురూపమైన గొప్ప పండుగ బతుకమ్మ. పాటలు, చప్పట్లతో ప్రకృతిని ఆరాధిస్తూ ఆడపడుచులంతా ఆడిపాడుతుంటారు. అయితే మహిళలంతా ఉత్సాహంగా జరుపుకునే ఈ వేడుక వెనుక విషాద గాథ ఉంది. ఆ గాథ గురించి ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో.. ఒకప్పుడు ఈ బతుకమ్మను బాధతో జరుపుకునేవారు. ఎంగిపూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. తెలంగాణ వచ్చాక ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చినా వెయ్యేళ్లుగా బతుకమ్మను ఈ ప్రాంత ప్రజలు ఇంటి దేవతగా పూజిస్తున్నారు. బతుకమ్మ వెనుక ఎన్నో చరిత్రలు, పురాణాలు దాగి ఉన్నాయి. బతుకమ్మ పండుగ శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వాళ్ల ఆకృత్యాలతో నలిగిపోయిన ప్రజలను, ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లను తలుచుకుంటూ తోటి మహిళలు బాధపడేవారు. అందుకే గుర్తుగా పూలను పేర్చి బతుకు అమ్మా అని దీవిస్తూ పాటలు ఆలపించేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదేనని చెబుతుంటారు. చల్లగా బతుకు అని ఆడబిడ్డలను దీవించడమే బతుకమ్మ ముఖ్య ఉద్దేశ్యమనే మాట వినిపిస్తుంది. అలాగే మరో నేపథ్యం కూడా ఉంది. తెలంగాణను రాష్ట్రకూట రాజులు పాలించేవారు. ఇది కూడా చదవండి: 40 ఏళ్లు పైబడిన వారు ఎంత దూరం నడవాలి..? మెరూ పర్వతం రూపంలో.. చాళుక్యుల, రాష్ట్రకూటుల మధ్య పోరాటం జరిగితే చాళుక్యుల రాష్ట్రకూటుల సైన్యానికి మద్దతిచ్చారు. రాజరాజ చోళుడు మన తెలంగాణలోని వేములవాడ ఆలయం నుంచి శివలింగాన్ని.. పార్వతి దగ్గరి నుంచి వేరుచేసి తంజావూరుకు పంపినందుకు మన ప్రజలు ఎంతో కలత చెందారు. బృహదమ్మ నుంచి శివుడి లింగం వేరుచేసినందుకు తమ బాధను చోళులకు తెలిసేలా మెరూ పర్వతం రూపంలో పూలనుపేర్చి బతుకమ్మ ఆడటం మొదలుపెట్టారు. ఇలా ప్రతి ఏడాది మన బతుకమ్మను జరపడం ఆనవాయితీగా వస్తోంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: నెల రోజులు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. ఆ వ్యాధులు పరార్! #Bathukamma 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి