Antibiotics: చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా? యాంటీబయాటిక్స్ అధిక వినియోగం తీవ్రమైన మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది. వీటిని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. వృద్ధులకు, పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. అయితే తాజాగా ఓ పరిశోధనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యాంటీబయాటిక్స్ అధిక వినియోగం తీవ్రమైన మానసిక అనారోగ్యానికి కారణమవుతుందంటున్నారు. 2/6 దీర్ఘకాలం పాటు యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల తీవ్రమైన మెదడు వ్యాధి వచ్చే అవకాశం ఉందని దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు తెలిపారు. 3/6 యాంటీ బయాటిక్స్ సాధారణంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారు. సాధారణ ఔషధంతో పాటు యాంటీ బయాటిక్ కూడా వైద్యులు ఇస్తుంటారు. 4/6 దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు యాంటీ బయాటిక్స్ దీర్ఘకాలం తీసుకోవడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధికి కారణమవుతుందని చెప్పారు. 40 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 2,98,379 మందిపై పరిశోధనలు చేశారు. 5/6 ఏడాదిపాటు యాంటీ బయాటిక్స్ తీసుకున్న వారిలో, 121 రోజులకు పైగా యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదం 29శాతం పెరిగిందని చెబుతున్నారు. 6/6 వైద్యుల సలహా మేరకు మాత్రమే యాంటీ బయాటిక్స్ చాలా జాగ్రత్తగా వాడాలని, యాంటీ బయాటిక్స్ ఎక్కువ కాలం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ముఖ్యంగా వృద్ధులకు లేదా పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వకూడదంటున్నారు. #antibiotics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి